IQOO Z10 Light 5G: ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో సరసమైన స్మార్ట్‌ఫోన్

వివోకి చెందిన సబ్‌బ్రాండ్ అయిన ఐకూ (iQOO) భారత మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే iQOO Z10 Lite 5G పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేసింది.

ఈ ఫోన్‌ని మూడు రకాల వేరియంట్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్.. కస్టమర్లకు మంచి అనుభవం ఇస్తుందని అంటున్నారు.

iqoo-z10-light-5g-specifications-and-price-details

iQOO Z10 Lite 5G ఫీచర్లు..

ధరలు & వేరియంట్లు..

iQOO Z10 Lite 5G మూడు వేరియంట్లలో లభించనుండగా.. జూన్ 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon.in, అలాగే ఐకూ ఇండియా ఈ-స్టోర్‌లో అందుబాటులోకి వస్తుంది.

  • 4GB RAM + 128GB స్టోరేజ్ – రూ. 9,999

  • 6GB RAM + 128GB స్టోరేజ్ – రూ.10,999

  • 8GB RAM + 256GB స్టోరేజ్ – రూ.12,999

    రంగులు..

    ఈ ఫోన్ సైబర్ గ్రీన్ మరియు టైటానియం బ్లూ అనే ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

    డిజైన్..

    ఫోన్ బాడీ డ్యూయల్-షేడెడ్ ఫినిష్‌తో డిజైన్ చేయబడింది. SGS 5-స్టార్ యాంటీ-ఫాల్ సర్టిఫికేషన్ మరియు మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H ధృవీకరణ పొందిన ఫోన్ కావడం దీన్ని మిగతా ఫోన్లకంటే బెటర్ గా చూపిస్తోంది.

    ప్రాసెసర్ & OS..

    • MediaTek Dimensity 6300 చిప్‌సెట్ (6nm ఫాబ్రికేషన్ టెక్నాలజీ)

    • ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15

      డిస్‌ప్లే..

      • 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్

      • 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్

      • 20:9 అస్పెక్ట్ రేషియో

      • 90Hz రిఫ్రెష్ రేట్

      • 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

        ఈ స్క్రీన్ గేమింగ్, వీడియోలు, సాధారణ నావిగేషన్‌కు స్మూత్ అనుభూతిని కలిగిస్తుంది.

        కెమెరా & బ్యాటరీ..

        ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, వెనుకవైపు 50MP AI ప్రైమరీ సెన్సార్, మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 5MP కెమెరా ఉంది. 6,000mAh బ్యాటరీతో ఇది పని చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల వరకు పాటలు వినొచ్చు, అలాగే 37 గంటల వరకు మాట్లాడొచ్చని కంపెనీ చెబుతోంది. కంపెనీ AI ఎరేజర్, అలాగే AI ఫోటో ఎన్‌హాన్స్ వంటి AI ఫీచర్లను కూడా ఇచ్చింది. వీటితో యూజర్లు ఫోటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు.

        కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..

        • 5G డ్యుయల్ నెట్‌వర్క్ సపోర్ట్

        • Bluetooth 5.4, Wi-Fi 5

        • GPS, GLONASS, GALILEO, BeiDou, GNSS, QZSS

        • USB టైప్-C పోర్ట్

        • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

        • Face Unlock

        • వన్-హ్యాండ్ మోడ్, గేమ్ మోడ్, అగ్రెసివ్ బ్యాటరీ మేనేజ్మెంట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+