హరిణిని బైక్ క్లచ్ వైర్ తో కిరాతకంగా.. కొత్తగూడెం నర్సింగ్ విద్యార్థిని కేసును ఛేదించిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య ఘటన ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్లుగా వెంటతిరిగినా యువతి తనను దూరం పెడుతోందని కక్ష పెంచుకున్న అతడు ఉన్మాదిగా మారి హరిణిని కిరాతకంగా హతమార్చినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన బైక్ కోసం వచ్చిన నిందితుడు పవన్ ను పక్కా సమాచారంలో సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు. అతడి నుండి హత్యకు ఉపయోగించిన బైక్ గేర్ వైర్, ఓ గ్లామర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, హత్య సమయంలో నిందితుడు ధరించిన షర్ట్‌ ను సీజ్ చేసినట్లు తెలిపారు.

కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సతీష్, రాజేశ్వరి దంపతుల కుమార్తె హరిణి, నిందితుడు దేవరకొండ పవన్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో పవన్ ఏ పనీ చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్న క్రమంలో హరిణి అతడ్ని దూరం పెట్టింది. అయితే వీరి ప్రేమ విషయంపై ఏడాది క్రితం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టారు. పవన్ కుమార్ ప్రవర్తన సరిగ్గా లేనందువల్ల తమ కూతురు హరిణిని ఇచ్చి పెళ్లి చేయలేమని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.

అయితే పవన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. తరచూ ఆమె వెంట పడుతూ వేధించసాగాడు. ఈ క్రమంలో పవన్ మొబైల్ నెంబర్ ను హరిణి బ్లాక్ చేసింది. అంతేకాక ఇన్ స్టా గ్రామ్ ఖాతాను సైతం మార్చేసింది. దాంతో హరిణిపై మరింత కక్ష పెంచుకున్నాడు పవన్. ఇక హరిణిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి సెప్టెంబర్ 22 న మధ్యాహ్నం సమయంలో వెంగన్నపాలెంలోని హరిణి ఇంటికెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ సమయంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన పవన్ తన వెంట తెచ్చుకున్న బైక్ గేర్ వైరుతో హరిణి మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృత దేహాన్ని మెట్ల సందులో ఉన్న పొదల్లో పడేసి పరార్ అయ్యాడు.

Police crack the murder case of Kothagudem nursing student Harini murder shocking details revealed

ఇక హరిణి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలూరుపాడు పోలీసులు మొదట ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే పోస్టుమార్టంలో ఇది హత్య అని తేలడంతో హత్య కేసుగా మార్చి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. మరోవైపు హరిణిని హత్య చేసిన పవన్.. తన బైక్ ను సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు. ఇక అక్కడి నుంచి ఖమ్మం, తిరుపతి, విశాఖపట్నం తిరిగాడు. అయితే ఏదైనా ప్రాంతానికి పోయి రాపిడో నడుపుకుందామని బైక్ ను తీసుకునేందుకు సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్దకు రావడంతో పోలీసులు పక్కా సమాచారంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+