అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం బడా కంపెనీల పోటీ!

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రూపు రేఖలు మార్చే పనిలో పడింది. ఏపీ నుండే కేంద్ర ఏవియేషన్ మంత్రి ఉండటంతో ఏపీ పంట పండింది. ఇప్పటికే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేసి విమానాలు అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. జీఎంఆర్, టాటా, అదానీ, ఫ్రాన్స్‌కు చెందిన విన్సి ఎయిర్‌పోర్ట్స్, ఫెయిర్‌ఫాక్స్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాయి.

Amaravati International Airport Major Companies Eye on Amaravati greenfield International Airport GMR Tata Adani in Race

గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావేల గ్రామం సమీపంలో సుమారు 5,000 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎయిర్‌పోర్టు, అనుబంధ ప్రాజెక్టులు, రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లతో కలిపి మొత్తం 20,000 ఎకరాల భూసమీకరణ అవసరమవుతుందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రైతులకు అన్యాయం జరగకుండా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే భూములు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

చంద్రబాబుకు శంషాబాద్, భోగాపురం విమానాశ్రయాలను విజయవంతంగా నిర్మించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం రాజధాని అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. దీంతో పారిశ్రామిక వర్గాలు ఈ ప్రాజెక్టు కోసం పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం.

అమరావతి విమానాశ్రయాన్ని కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయి 'ఏరోసిటీ'గా తీర్చిదిద్దాలని ప్రణాళిక ఉంది. విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ఎంఆర్వో సదుపాయాలు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని అభివృద్ధితో పాటు పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో అమరావతికి అంతర్జాతీయ కనెక్టివిటీ అత్యవసరం.

ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!
ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!

ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. టెండర్లు పిలవకముందే బడా కంపెనీలు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపడం ప్రాజెక్టు ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాజధాని అమరావతి పురోగతిలో కొత్త శకం ప్రారంభం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+