బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ తో రూ.1 లక్ష ప్రమాద బీమా.. రూ.10 వేల అదనపు బెనిఫిట్!

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీఎస్ఎన్ఎల్. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని ఆర్ధిక భద్రత ఇస్తోంది. ఎంపిక చేసిన కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై ఉచితంగా రూ.1 లక్ష ప్రమాద బీమా, రూ.10 వేల సైబర్ ఫ్రాడ్ కవరేజ్ ఇస్తోంది. దీని కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ ఆఫర్ STV 202 మరియు STV 2449 ప్లాన్లకు వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. రీఛార్జ్ చేసిన వెంటనే బీమా పాలసీ అమలులోకి వస్తుంది. ప్లాన్ చెల్లుబాటు అయ్యేంత వరకు ఈ కవరేజ్ ఉంటుంది. ఇక ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలలోకి వెళితే STV 202 ప్లాన్ లో 300 నిమిషాల వాయిస్ కాల్స్ తో పాటు, 5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.

BSNL Bumper offer BSNL Free Rs 1 Lakh Accident Insurance and Rs 10k Cyber Cover with Selected Recharge Plans

దీనిపై ఉచిత ప్రమాద బీమాతో పాటు సైబర్ కవరేజ్ కూడా అందిస్తోంది. STV 2449 ప్లాన్ లో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు. దీనిపై కూడా ఉచిత రూ.1 లక్ష ప్రమాద బీమా, రూ.10 వేల సైబర్ కవరేజ్ అందిస్తోంది.

ప్రమాదవశాత్తు మరణం జరిగితే రూ.1 లక్ష వరకు బీమా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ నంబర్‌పై సైబర్ మోసాల బారిన పడితే రూ.10 వేల వరకు కవరేజ్ ఇచ్చేలా ఈ ప్లాన్ ఉంటుంది. రీఛార్జ్ తర్వాత యూజర్లు సెల్ఫ్ కేర్ పోర్టల్ లేదా ఎస్ఎంఎస్ లింక్ ద్వారా నామినీ వివరాలు ఈ ఇన్సూరెన్స్ కోసం నమోదు చేసుకోవాలి.

ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!
ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!

ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచుతున్న వేళ, వినియోగదారులను ఆకర్షించేలా బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించడం వినియోగదారులకు మంచి అండగా నిలుస్తుంది. ఇప్పుడు దేశంలోనే బీమా కవరేజ్ అందిస్తున్న తొలి టెలికాం కంపెనీగా బీఎస్ఎన్ఎల్ నిలిచింది. యూజర్లు తమ ప్లాన్ వివరాలు చూసుకుని, నామినీ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం మంచిదని చెప్తోంది. ఈ ఆఫర్ వల్ల అదనపు భద్రత లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+