ఇస్రో అధికారాలు కట్: సైంటిస్టులకు చెక్: కేంద్రం నూతన గైడ్ లైన్స్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'గగన్‌యాన్' వంటి కీలక ప్రాజెక్టులకు మానవ వనరులు ఓ సవాల్ గా మారింది. ఈ మిషన్ లల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు స్వచ్ఛంద విరమణ, రాజీనామాల వైపు మొగ్గు చూపుతుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ తక్షణమే స్పందించింది. దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంతరిక్ష ప్రయోగాలపై దీని దుష్ప్రభావం పడకుండా ఉండేందుకు నూతన మార్గదర్శకాలను ఇచ్చింది.

ఇస్రో పరిధిలోని వివిధ విభాగాలు, పరిశోధనా కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తున్న గ్రూప్ ఏ సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది వీఆర్ఎస్, రాజీనామా అభ్యర్థనలను ఆయా కేంద్రాల డైరెక్టర్లు ఓ సాధారణ ప్రక్రియగా ఆమోదించడాన్ని నిలిపివేస్తూ కేంద్రంమెమోరాండం విడుదల చేసింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. గతంలో సైంటిస్ట్ లేదా ఇంజనీర్-ఎస్జీ (లెవెల్-13ఏ), ఆ లోపు కేటగిరీ అధికారుల రాజీనామాలను స్థానిక కేంద్రాల అధిపతులే ఆమోదించే వీలుండేది.

ISRO Gaganyaan Scientific and Technical Personnel VRS or Resignation Requests May Not Be Accepted

దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ పాత అధికారాల నిబంధనలను సవరించింది. నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. గగన్‌యాన్, ఇతర స్పేస్ ప్రాజెక్టులలో భాగస్వాములైన సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో వీఆర్‌ఎస్‌లు, రాజీనామాల కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వీటి వల్ల జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతి దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది.

సీఎం విజయ్ బాటలో వైఎస్ జగన్: క్యాడర్ కు వెన్నుదన్నుగా- గేమ్ ఛేంజర్
సీఎం విజయ్ బాటలో వైఎస్ జగన్: క్యాడర్ కు వెన్నుదన్నుగా- గేమ్ ఛేంజర్

ఈ నేపథ్యంలో, గగన్‌యాన్ మిషన్‌తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ఏ ఒక్క సాంకేతిక నిపుణుడి రాజీనామా లేదా వీఆర్‌ఎస్ ప్రతిపాదనలను ఇకపై సాధారణ పద్ధతిలో ఆమోదించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. గగన్‌యాన్ లేదా ఆయా అంతరిక్ష యాత్రల ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అయ్యేంత వరకూ వాటిలో నిమగ్నమైన ఏ ఒక్క గ్రూప్ 'ఏ' టెక్నికల్ అధికారి అభ్యర్థనను కూడా స్థానిక కేంద్రాల డైరెక్టర్లు నేరుగా ఆమోదించడానికి వీల్లేదు.

KSRTC బస్టాండ్ లో.. అందరూ చూస్తుండగా: సీసీటీవీ ఫుటేజీలో.. !!
KSRTC బస్టాండ్ లో.. అందరూ చూస్తుండగా: సీసీటీవీ ఫుటేజీలో.. !!

ఒకవేళ ఎవరైనా విధులను వదులుకోవాలని భావించి దరఖాస్తు చేసుకుంటే, ఆ అభ్యర్థన పత్రాలను స్థానిక కేంద్రాల డైరెక్టర్ల స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదిక రూపంలో తుది నిర్ణయం కోసం కేంద్ర అంతరిక్ష శాఖ ఉన్నతాధికారులకు తక్షణమే పంపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ ఆర్ రాజశేఖర్ ఆమోదంతో జారీ అయిన ఈ కీలక ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి కూడా.

ఈ నూతన మార్గదర్శకాలను ఎంతో కఠినంగా అమలు చేయాలని ఇస్రోకు చెందిన ప్రముఖ విభాగాలైన విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ), యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యుఆర్‌ఎస్‌సీ), సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్), హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్‌ఎఫ్‌సీ) లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 14 ప్రధాన కేంద్రాల అధిపతులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+