ఆటమిక్ క్లాక్: ఇస్రో మరో బిగ్ మిషన్- మన శ్రీహరికోట నుంచి 100 ప్రయోగం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో భారీ మిషన్‌ను ప్రకటించింది. దేశ నేవిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. దీనితో- తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం చరిత్ర సృష్టించబోతోంది. 100 ప్రయోగాలను పూర్తి చేసుకున్నట్టవుతుంది.
జనవరిలో నేవిగేషన్ శాటిలైట్ (ఎన్‌వీఎస్) 2 ను శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. గతంలో చేపట్టిన ఎన్‌వీఎస్ 1కు కొనసాగింపుగా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించబోతోన్నామని, జనవరిలో ఈ ప్రయోగం ఉంటుందని చెప్పారు.

దీనికోసం జియోసింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ఉపయోగిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన తుది ఏర్పాట్లు పూర్తవుతున్నాయని అన్నారు. 2025లో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టబోతోన్నామని, ఎన్వీఎస్ 2తో బోణీ చేస్తామని సోమ్‌నాథ్ పేర్కొన్నారు.
గత ఏడాది మే 29వ తేదీన ఎన్‌వీఎస్ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. జీఎస్ఎల్‌వీ- ఎఫ్ 12 రాకెట్‌ను దీనికోసం ఉపయోగించిందప్పట్లో. 2,232 కేజీల బరువు ఉన్న ఉపగ్రహం అది. జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో విజయవంతంగా అడుగుపెట్టింది. నిరంతరాయంగా తన సేవలను అందిస్తోంది.
ప్రతిష్ఠాత్మకమైన ఆటమిక్ క్లాక్ ఉన్న శాటిలైట్ అది. ఆటమిక్ క్లాక్‌తో పాటు ఎల్1 బ్యాండ్, నేవిక్ వంటి పేలోడ్స్‌ను తనవెంట మోసుకెళ్లింది జీఎస్ఎల్‌వీ- ఎఫ్12. ఇప్పుడు దీని సేవలను మరింత విస్తృతపర్చాలని నిర్ణయించుకుంది ఇస్రో. ఎన్‌వీఎస్ 2ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది.












Click it and Unblock the Notifications