ఏమిటిది..?!- తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్న ఇస్రో: గ్రహాంతరవాసులు ఉన్నారా?

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అనలాగ్ స్పేస్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. లడఖ్‌లోని లేహ్‌లో దీన్ని ప్రారంభించింది. ఈ తరహా స్పేస్ మిషన్ ఏర్పాటు చేయడం.. దేశ అంతరిక్ష చరిత్రలోనే మొట్ట మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గ్రహాంతర వాతావరణాల పరిస్థితులు, ఇతర గ్రహాలపై బుద్ధిజీవులు ఉన్నాయా? లేవా? అనే అంశాపై అధ్యయనం చేయడానికి నెలకొల్పిన మిషన్ ఇది. ఆయా గ్రహాలపై ఆవాసం ఉండటానికి అనువైన వాతావరణం ఉందా?.. ఒకవేళ- ఉంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఈ మిషన్ ద్వారా తెలుసుకోగలుగుతుంది ఇస్రో.

ISRO kick starts the India s first analog space mission Ladakh

హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్, యూనివర్శిటీ ఆఫ్ లడఖ్, ఐఐటీ- బోంబే, ఆకా స్పేస్ స్టూడియో సహకారంతో నాసా దీన్ని డెవలప్ చేసింది. అంగారక గ్రహం, చంద్రుడి ఉపరితలానికి దాదాపుగా సరిపోలిన ప్రాంతం కావడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్ల దీన్ని ఈ అనలాగ్ స్పేస్ మిషన్‌ను లఢక్‌లో నెలకొల్పింది ఇస్రో. దీనికి హెచ్ఏబీ 1 అని పేరు పెట్టింది.

దేశంలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే లడఖ్‌లో గల భౌగోళిక పరిస్థితులు, అక్కడి వాతావరణం, ఉపరితలం.. పూర్తిగా భిన్నం. అత్యంత ఎత్తైన ప్రదేశం అదే. గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోవడం సైతం కష్టతరమౌతుంటుంది ఒక్కో సందర్భంలో.

ఇలాంటి వాతావరణం దాదాపుగా అంగారక గ్రహంతో పోలి ఉంటుందని భావిస్తోంది ఇస్రో. చంద్రుడి ఉపరితలంతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఈ అనలాగ్ మిషన్‌‌ను నెలకొల్పడానికి లఢక్‌ను అనువైన ప్రదేశంగా గుర్తించింది. పైగా మానవ సంచారం నామమాత్రంగా కూడా ఉండదిక్కడ.

భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఈ అనలాగ్ మిషన్ సహకరిస్తుందని ఇస్రో చెబుతోంది. ఇతర గ్రహాలపై ఉండే వాతావరణం గురించి అధ్యయనం చేయడం వల్ల దానికి అనుగుణంగా మనుషులను అక్కడికి పంపించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చని భావిస్తోంది.

ఈ మిషన్ సేకరించే డేటా ఆధారంగా చంద్రుడు, అంగారక గ్రహాల వంటి దీర్ఘ కాల అంతరిక్ష మిషన్లను మున్ముందు చేపట్టవచ్చని ఇస్రో చెబుతోంది. ఈ అనలాగ్ మిషన్‌లో బెడ్, హైడ్రోఫోనిక్స్ ఫామ్, కిచెన్ ఏరియా, శానిటేషన్, ఎయిర్‌లాక్ వంటి ప్రాథమిక అవసరాలకు సంబంధించన అన్న సౌకర్యాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+