Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ISRO Proba -3:సూర్యుడి చెంతకు..కృత్రిమ సూర్యగ్రహణం..ఎన్నో రహస్యాలు..!!

ISRO Proba -3:అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చేసేందుకు ఇస్రో సన్నద్ధం అవుతోంది. ఇప్పటి వరకు చంద్రయాన్‌లాంటి ప్రయోగం చేసి భారత్‌ను ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలిపిన ఇస్రో ఇప్పుడు ఏకంగా సూర్యుడినే లక్ష్యంగా చేసుకుని ప్రయోగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కు చెందిన ప్రోబా-3(Proba-3)ని సూర్యుడి చుట్టూ పరిబ్రహ్మింపచేసే యోచనలో ఉంది. తద్వారా నింగిలో కృతిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు తయారవుతోంది.

రెండు ఉపగ్రహాలను ఇందుకు వినియోగిస్తోంది ఇస్రో. సూర్యుడి యొక్క బాహ్య వలయం కొరొనాను స్టడీ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇది సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సూర్యుడి బాహ్యవలయంలో వాతావరణం ఎలా ఉంటుందో స్టడీ చేయనుంది. ఇదే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా ఇస్రో పేర్కొంది.'

ISRO s Proba-3 Launch Exploring Solar Mysteries Through Artificial Eclipse

ప్రోబా -3 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముహూర్తంగా ఎంచుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).ఈ ప్రయోగం కోసం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)ని వినియోగించుకోనుంది. ప్రోబా -3 మిషన్‌లో ఓకల్టర్ శాటిలైట్ (OSC),కరోనాగ్రాఫ్ శాటిలైట్ (CSC) అనేవి రెండు ఉపగ్రహాలు ఉంటాయి.OSC సూర్యకాంతిని లేదా సూర్య రశ్మిని నిరోధించేందుకు రూపొందించిన 1.4 మీటర్ల డిస్క్ కలిగి ఉంటుంది., ఇది 150 మీటర్ల దూరంలో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పుతో నీడను సృష్టిస్తుంది. ఈ నీడలోనే కొరొనొగ్రాఫ్ శాటిలైట్ CSC అమర్చడం జరుగుతుంది.ఇందులో 5 సెంటీమీటర్ల అపర్చర్‌తో కూడిన టెలిస్కోప్ ఉంటుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఒకే లైనులో కరెక్ట్‌గా ఉంటాయి. ఈ అమరిక అపాగీ వద్ద జరుగుతుంది. భూమినుండి దాదాపుగా 60వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటంతో ఉపగ్రహం స్థిరంగా ఉంటుంది.

సోలార్ కొరోనా అధ్యయనం ఎందుకు..?

సోలార్ డైనమిక్స్‌లో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులను స్టడీ చేసేందుకు సోలార్ కొరానా గురించి అధ్యయనం చేస్తారు. దీంతో అంతరిక్షంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై కూడా అవగాహన వస్తుంది.సౌర తుఫానులు, కొరానా నుంచి విడుదలయ్యే ఇతర సౌర వ్యర్థాలతో భూమిపై ఉన్న పవర్ గ్రిడ్‌లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను అవి ఏ రకంగా ధ్వంసం చేయగలవో అంచనా వేయొచ్చు. అయితే కొరొనాను పరిశీలించడం అత్యంత కష్టమైన పని, ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి, కొరొనాలో ఉన్న అత్యంత కాంతివంతమైన పాయింట్ కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ కాంతి ఉంటుంది. దీంతో టెలిస్కోపులకు కూడా సాధ్యపడదు.

1930లో కనుగొన్న కొరొనొగ్రాఫ్‌లలో ఉండే ఆకల్టింగ్ డిస్క్‌లు సూర్యకాంతిని అడ్డుకుంటాయి.అయితే సూర్యకాంతి నిటారుగా కాకుండా కాస్త ఒంపుతో ఉండటం వల్ల కొరొనా అంతర్భాగం పూర్తిగా కాకుండా కొంత వరకు మాత్రమే కనిపిస్తుంది.అయితే సహజ పద్ధతిలో ఏర్పడే సూర్య గ్రహనం కరోనాను పరిశీలించేందుకు మార్గం సుగుమం చేస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా అవకాశాలు వస్తుంటాయి. అంతేకాదు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.ఇలాంటి సవాళ్లకు సమాధానంగా ప్రోబా -3 డిజైన్ ఉంది. వీటన్నిటినీ చేధించేందుకే ప్రోబా-3ని తయారు చేశారు.ప్రోబా -3 సృష్టిస్తున్న కృత్రిమ సూర్య గ్రహనంతో కొరోనాలో ఏం జరుగుతుందో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకధాటిగా 6 గంటల సమయం పాటు పరిశీలించి ఒక అంచనాకు రావొచ్చు.సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్లేషణ కూడా ఖచ్చితత్వంతో చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి కరోనా మధ్య గ్యాప్‌ ఏర్పడటంతో ఇప్పటి వరకు ఎలాంటి స్టడీ బయటకు రాలేదు. ఇక ఈ మిషన్ విజయవంతమైతే గ్యాప్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయనే అంశాన్ని శాస్త్రవేత్తలు బయట ప్రపంచానికి తెలిపే అవకాశం ఉంది. మొత్తానికి ప్రోబా-3 ప్రయోగం సక్సెస్ అయితే సౌర పరిశోధన రంగంలో విప్లవాత్మకమైన అంశాలు బయటపడే అవకాశాలున్నాయి. అంతేకాదు సూర్యుడికి సంబంధించిన పలు అంశాలు, అక్కడి పరిసర వాతావరణంపై చోటు చేసుకునే మార్పులు, ఆ మార్పుల ప్రభావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+