బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్‌ను 70 ఎంఎంలో చూపించిన ఇస్రో..!!
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం మూడు రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై పడింది. ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై పంజా విసురుతోంది. అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.
ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలికి ఉత్తరం- ఈశాన్య దిశగా 310, తమిళనాడులోని నాగపట్నానికి తూర్పు దిశగా- 260, పుదుచ్చేరికి తూర్పు- ఆగ్నేయ దిశగా 370, చెన్నైకి ఆగ్నేయ దిశగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

క్రమంగా ఇది వాయవ్య దిశగా కదిలి.. శనివారం మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మహాబలిపురం మధ్య సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
రెండు రోజుల్లో కాంచీపురం, తిరువళ్లూర్, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి.. జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యలో ఆయా జిల్లాలల్లో పాఠశాలలకు సెలవును ప్రకటించింది.
ఈ తుఫాన్ కదలికలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో రికార్డు చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇస్రో గతంలో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్- 6, ఇన్సాట్ 3డీఆర్ శాటిలైట్లు పసిగట్టాయి.
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌లో అమర్చిన స్కాట్టెరోమీటర్ ద్వారా ఈదురు గాలుల వేగాన్ని సైతం ఇస్రో లెక్క గట్టింది. ఈ నెల 23వ తేదీన తూర్పు బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం మధ్య ప్రాంతంలో ఈ తుఫాన్ ఉపరితల ఆవర్తనంగా ఆవిర్భవించినప్పటి నుంచీ దీని కదలికలన్నింటినీ ఈ రెండు శాటిలైట్లు కూడా రికార్డు చేస్తూ వచ్చాయి.
🌩️ ISRO Satellites Tracking Deep Depression Over Bay of Bengal 🌊
— ISRO (@isro) November 29, 2024
ISRO's EOS-06 & INSAT-3DR satellites are closely monitoring the deep depression over the Bay of Bengal since Nov 23, 2024. Satellite inputs aid in better tracking, early warning and mitigation.
Key Updates:
🌀… pic.twitter.com/CXMlaieuNs












Click it and Unblock the Notifications