రూ.9,599 కే 50 ఎంపీ కెమెరా, ఏఐ టూల్స్ తో 5జీ ఫోన్..
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ప్రస్తుతం 5జీ టెక్నాలజీ దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్లో 5G ఫోన్ల డిమాండ్ గట్టిగానే ఉంది. ఈ క్రమంలోనే కస్టమర్లను పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు కూడా బడ్జెట్ ఫోన్లలో సైతం అదిరిపోయే ఫీచరను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ ధర తక్కువైనా, అందులో ఉన్న ఫీచర్లు మాత్రం ప్రీమియం ఫోన్లను తలదన్నేలా రూపొందిస్తూ మార్కెట్ పెంచుకుంటుంది ఐటెల్ (itel) సంస్థ.
ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త బడ్జెట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. Android 14, 50MP కెమెరా, AI టూల్స్, 120Hz డిస్‌ప్లే లాంటి సూపర్ ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చింది. itel A95 5G మోడల్ తో ఈ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ గురించి మీకోసం ప్రత్యేకంగా..
ITEL A95 5G ఫీచర్లు..
కెమెరా..
50MP డ్యూయల్ రియర్ కెమెరా.. 8MP ఫ్రంట్ కెమెరా 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. AI ఫీచర్లు, Vlog మోడ్, స్కై ఎఫెక్ట్స్, డ్యూయల్ వీడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ..
5000mAh బ్యాటరీతో 10W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
డిస్‌ప్లే..
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. IP54 రేటింగ్ ద్వారా ధూళి, నీటి చిటపాట్ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది.
ప్రాసెసర్..
ఐటెల్ A95 5Gలో MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మల్టీ టాస్కింగ్, యాప్స్ స్మూత్‌గా నడవడం, వీడియో కాలింగ్, సామాజిక మాధ్యమాలు, గేమింగ్ సహా మిగతా వాటికి బెస్ట్ అని చెప్పవచ్చు.
డిజైన్..
7.8mm సన్నని బాడీతో ఈ మోడల్ అందుబాటులో ఉంది.
అదనపు ఫీచర్లు..
డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్ - వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఉంది. అలానే ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ - TV, AC వంటి హోమ్ అప్లయన్స్‌లను రిమోట్‌గా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ధరలు..
4GB RAM + 128GB స్టోరేజ్ - రూ.9,599
6GB RAM + 128GB స్టోరేజ్ - రూ.9,999
స్టోరేజ్..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో లభిస్తోంది. 4GB RAM + 128GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్ తో వస్తున్నాయి. రెండు వేరియంట్‌లలోనూ వర్చువల్ RAMకు సపోర్ట్ లభిస్తుంది. 4GB మోడల్‌ను 8GB వరకు, 6GB మోడల్‌ను 12GB వరకు RAM వరకు పెంచుకోవచ్చు.
సెక్యూరిటీ..
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.
AI టూల్స్..
ఈ ఫోన్‌లో "iVAna AI Assistant" అనే సొంత వాయిస్ అసిస్టెంట్ ఉంది. ఇది రిమైండర్స్, కాల్ చేయడం, నావిగేషన్ గైడ్ చేయడం వంటి పనుల్లో సహాయపడుతుంది. ఐటెల్ ఈ ఫీచర్ ని బడ్జెట్ సెగ్మెంట్లో అందించటం సూపర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బడ్జెట్‌లో గేమింగ్ కోరేవారికి, సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లకు.. ఫస్ట్ టైం 5G ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా బోనస్ ఆఫర్ కింద 100 రోజుల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications