Instagram News: ఇన్‌స్టా లవర్స్‌కి సరైన ఫీచర్.. ఇకపై నోట్స్‌గా వీడియోలు..

Instagram Video Note: దేశంలో చాలా మంది యువత స్కూల్ ఏజ్ నుంచే సోషల్ మీడియా సాధనాలు విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్స్ అందుబాటులో తీసుకొస్తూ వారి ఎంగేజ్మెంట్ సమయాన్ని, అనుభూతిని మెరుగుపరుస్తోంది.

ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్‌కి మెటా మరో అప్‌గ్రేడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని వినియోగించి నోట్స్‌కు షార్ట్ వీడియోలను యూజర్లు అటాచ్ చేసి తమ ప్రియమైనవారికి తమ మూడ్ గురించి తెలియజేయవచ్చు. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్ సెక్షన్ నుంచి షార్ట్ టెక్స్ట్ నోట్స్ షేర్ చేసుకోవచ్చు. ఫీచర్ ద్వారా 2 సెకన్ల వీడియోలను నోట్స్ కి అటాచ్ చేసుకోవటానికి మాత్రమే అవకాశం కల్పించబడింది. ఈ కొత్త వీడియో స్టేటస్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో పరిశీలిస్తే..

Know how to share Instagram Video Note in easy steps in detail

వీడియో నోట్స్ అప్‌లోడ్ చేయటానికి మీ డైరెక్ట్ మెసేజింగ్ సెక్షన్ యాక్సెస్ చేయాలి. ముందుగా ఇందుకోసం యాప్‌ ఓపెన్ చేసి ఇన్‌బాక్స్‌కి వెళ్లాలి. నోట్స్‌లో ముందుగా ప్రొఫైల్ ఫొటోను ఎంచుకోండి. అక్కడ మీ ఫొటోపై ట్యాప్ చేయండి. ఆపై రికార్డింగ్ ప్రాసెస్ ప్రారంభించడానికి కెమెరా ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఫ్రంట్ కెమెరా ద్వారా రెండు సెకన్ల వీడియోని రికార్డు చేయాలి. నచ్చిన వీడియోను రికార్డు చేసి నోట్స్‌గా పంపుకోవచ్చు. పోస్టు చేయటానికి ముందు టెక్స్ట్ క్యాప్షన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్‌గా నోట్స్ పోస్ట్ చేయటం ద్వారా 24 గంటల పాటు మీ మూడ్ గురించి ఫాలోవర్లు, స్నేహితులతో పంచుకోవచ్చు.

కేవలం వీడియో నోట్స్ పోస్ట్ చేయటంతో పాటు దానికి మీ స్నేహితులు ఇచ్చే కామెంట్లకు రిప్లై కూడా ఇచ్చేందుకు అవకాశం కల్పించబడింది. ఇందుకోసం ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజ్ సెక్షన్‌కు వెళ్లి డైరెక్ట్ మెసేజ్‌లకు నావిగేట్ చేయండి. అక్కడ రిప్లై డాక్యుమెంట్ ఓపెన్ చేసి.. రిప్లై ఇవ్వాలనుకునే వీడియో నోట్‌పై క్లిక్ చేయాలి. మీ ఫొటో, వీడియో, జిఫ్ లేదా ఆడియో నోట్స్ పంపడానికి మీ మెసేజ్ టైప్ చేయండి లేదా ఆప్షన్లను ఎంచుకోండి. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+