నోకియా పతనం వెనుక పెద్ద కథే ఉందిగా..!

నోకియా అనే పేరు వినగానే చాలామందికి మొదటి మొబైల్ ఫోన్ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌ను ఏలిన ఈ ఫిన్నిష్ కంపెనీ తన ప్రయాణంలో అనేక మలుపులు తిరిగింది.నోకియా తన ప్రయాణాన్ని ఒక కాగితపు మిల్లుగా ప్రారంభించి, తర్వాత రబ్బర్, కేబుల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాలలోకి అడుగుపెట్టింది. 1980లలో మొబైల్ ఫోన్‌ల రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసింది. నోకియా 3310 ఈ మోడల్‌ను మరచిపోవడం అసాధ్యం. దీని బలమైన నిర్మాణం మరియు బ్యాటరీ లైఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అమ్ముడుపోయింది. నోకియా ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌ని ఏలిన కంపెనీ. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కంపెనీ పతనం అయింది.

నోకియా పతనం చెందడానికి ప్రధాన కారణాలు:
నోకియా ఫీచర్ ఫోన్‌లలో దిట్టగా ఉండగా, స్మార్ట్‌ఫోన్‌ల యుగం రావడంతో నోకియా తనను తాను అప్‌డేట్ చేసుకోలేకపోయింది. ఆపిల్‌ ఐఫోన్‌ మరియు సామ్‌సంగ్‌ ఆండ్రాయిడ్ ఫోన్‌లు మార్కెట్‌ని ఆక్రమించాయి.నోకియా తన సాఫ్ట్‌వేర్‌ని నిరంతరం అప్‌డేట్ చేయడంలో వెనుకబడింది. ఫలితంగా, వినియోగదారులు కొత్త ఫీచర్లు మరియు అనువర్తనాల కోసం ఇతర బ్రాండ్‌ల వైపు మొగ్గు చూపారు.

main reasons for the fall of Nokia

నోకియా మైక్రోసాఫ్ట్‌తో కలిసి విండోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌లను తయారు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించలేకపోయింది. చైనీస్ కంపెనీలు తక్కువ ధర మరియు అధునాతన ఫీచర్‌లతో మార్కెట్‌లోకి ప్రవేశించడంతో నోకియాకు పోటీ పెరిగింది.నోకియా తన మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయింది.

నోకియా ఈ కారణాల వల్లే పతనం:
స్మార్ట్‌ఫోన్ విప్లవం వచ్చినప్పుడు, నోకియా తన ఫీచర్ ఫోన్‌లకు అతుక్కుపోయింది.నోకియా తన సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్‌ను తరచుగా అప్‌డేట్ చేయలేదు.నోకియా చైనీస్ కంపెనీల పెరుగుదలను అంచనా వేయలేకపోయింది.

ప్రస్తుతం నోకియా:
నోకియా ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తుంది మరియు మార్కెట్‌లో తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. అయితే, మార్కెట్‌లో ఇప్పటికీ పోటీ చాలా ఎక్కువగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+