మిషన్ ఫెయిల్.. సునీతా విలియమ్స్‌కు నిరీక్షణ తప్పదా !
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు నిరీక్షణ తప్పదని తెలుస్తోంది. మూడోసారి రోదసిలోకి వెళ్లిన ఆమె.. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగానికి సిద్దమయ్యాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ ను రెడీ చేశారు. ఈ సిబ్బందిని పంపిన తర్వాతే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి తీసుకురావాలని భావించారు.
కేప్ కెనావెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బుధవారం ఉదయం 7.48 ETకి స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. నలుగురు వ్యోమగాముల్లో ఇద్దరు US, ఒకరు జపాన్, మరొకరిని రష్యా నుంచి ఎంపిక చేశారు. అయితే కానీ రాకెట్ లాంచ్‌ప్యాడ్‌లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పేస్‌ఎక్స్ క్రూ-10 ప్రయోగాన్ని రద్దు చేసింది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఆపేసినట్లు నాసా వెల్లడించింది.

ఈ మిషన్ మళ్లీ ఎప్పుడు తిరిగి ప్రయోగిస్తారని ఇంకా ప్రకటించలేదు. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరోసారి ప్రయోగం చేయనున్నట్లు సమాచారం. దీంతో వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడానికి మరికొన్ని రోజులు ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్‌ఎస్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు.
ఇక 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ లో వ్యోమగాములు సునీత, బుచ్ విల్మోర్ ఐఎస్‌ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో వారిద్దరూ కేవలం 8 రోజుల పని కోసమే వెళ్ళారు. అయితే స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్యాప్సూల్ వ్యోమగాములు లేకుండానే భూమిని చేరుకుంది. దాంతో సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్‌ఎస్ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications