"మోటరోలా" బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 8.1 అంగుళాల డిస్‌ప్లే !!

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా మరో కొత్త ప్రీమియం ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ప్రతిష్టాత్మక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026) వేదికగా మోటరోలా టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ గ్లోబల్ టెక్ ఈవెంట్‌లో సంస్థ తన తొలి బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ను 'మోటరోలా రేజర్ ఫోల్డ్' పేరుతో ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఫ్లిప్-టైప్ ఫోల్డబుల్ ఫోన్‌లకే పరిమితమైన మోటరోలా, ఈ ఫోన్‌తో ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.

ఫోల్డబుల్ మార్కెట్‌లో కొత్త అడుగు..

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ వంటి ప్రముఖ మోడళ్లకు పోటీగా రేజర్ ఫోల్డ్ నిలవనుంది. రేజర్ సిరీస్ అంటే గతంలో క్లామ్‌షెల్ డిజైన్‌తో నాస్టాల్జిక్ ఫీల్‌ను అందించిన బ్రాండ్‌గా పేరుంది. కానీ ఈసారి మోటరోలా పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేసింది. పెద్ద స్క్రీన్ అనుభవం, మల్టీటాస్కింగ్ సామర్థ్యం, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీ-all-in-one ప్యాకేజీగా ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

motorola-razr-foldable-phone-specifications-and-price-details

మోటరోలా రేజర్ ఫోల్డ్ ఫీచర్స్..

డిస్‌ప్లే..

లీకైన సమాచారం ప్రకారం, మోటరోలా రేజర్ ఫోల్డ్‌లో 8.1 అంగుళాల 2K LTPO ఫోల్డబుల్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది హై రిజల్యూషన్‌తో పాటు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్లను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌ను మడిచినప్పుడు ఉపయోగించేందుకు 6.6 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే అందించనున్నారు. ఫోల్డ్ చేసినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా, ఓపెన్ చేసినప్పుడు చిన్న టాబ్లెట్‌లా ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేయడం దీని ప్రత్యేకత.

స్టైలస్ సపోర్ట్‌తో ప్రొడక్టివిటీ..

ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా 'మోటో పెన్ అల్ట్రా' స్టైలస్ సపోర్ట్ నిలవనుంది. నోట్స్ తీసుకోవడం, డ్రాయింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి పనులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మోటరోలా ఫోల్డబుల్‌ను బిజినెస్ యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు మరింత ఇష్టపడేలా చేసే అంశంగా భావిస్తున్నారు.

కెమెరా..

కెమెరా సెగ్మెంట్‌లో కూడా మోటరోలా పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్ చేసింది. రేజర్ ఫోల్డ్‌లో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం. ఇందులో

సోనీ LYTIA మెయిన్ సెన్సార్,

50MP అల్ట్రా-వైడ్ + మాక్రో లెన్స్,

3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉండే అవకాశం ఉంది.

డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటంతో వీడియో క్రియేటర్లకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

సెల్ఫీ & వీడియో కాలింగ్..

సెల్ఫీ కోసం ఔటర్ స్క్రీన్‌పై 32MP కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో 20MP అండర్-డిస్‌ప్లే కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ డిజైన్ కారణంగా ప్రధాన కెమెరాలతోనే సెల్ఫీలు, వీడియో కాల్స్ చేయగలగడం మరో ప్లస్ పాయింట్.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ & బ్యాటరీ..

ప్రాసెసర్ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే తాజా స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ లేదా హైఎండ్ మీడియాటెక్ ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UIతో పనిచేయనుంది. LTPO టెక్నాలజీతో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్లు బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరుస్తాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని అంచనా.

లాంచ్ టైమ్‌లైన్ & ధర అంచనాలు..

CES 2026లో ప్రోటోటైప్‌ను ప్రదర్శించిన మోటరోలా, గ్లోబల్ లాంచ్ తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే 2026 వేసవిలో ముందుగా ఉత్తర అమెరికాలో, ఆ తరువాత ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది. భారత మార్కెట్‌లో ఈ ఫోన్ 2026 చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్ల కారణంగా దీని ధర అధికంగా ఉండనుంది. అంచనాల ప్రకారం, ప్రారంభ ధర సుమారు $1,500 (భారత కరెన్సీలో ₹1.25 లక్షల పైగా) ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+