Alien Life: ఏలియన్స్ ఉన్నాయ్..!! వచ్చే నెల ఆధారాలు బయటకు, నాసా చిత్ర నిర్మాత షాకింగ్..

Aliens News: ప్రపంచవ్యాప్తంగా మానవుల్లో చాలా కాలంగా ఉన్న అనుమానం గ్రహాంతర జీవులు ఉన్నారా లేదా అనేదే. పలుమార్లు శాస్త్రవేత్తలను మీడియా దీనిపై అడిగిన ప్రశ్నలకు వారు ఉండొచ్చనే సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిన ఒక కీలక ప్రకటన బయటకు రావటం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా ఈ విషయపై నాసా చిత్రనిర్మాత ప్రకటన చేస్తూ.. భూమిపై ఉన్న టెలిస్కోప్‌లు తెలివైన గ్రహాంతర జీవులకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నాయని, వచ్చే నెలలో వాటిని బహిర్గతం చేస్తామని అన్నారు. సైన్స్ ఫిల్మ్ మేకర్ సైమన్ హాలండ్ ఇప్పటికే బీబీసీ, నేషనల్ జియో, నాసా వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఏలియన్స్ లైఫ్ గురించి సాక్ష్యాలను బయటపెట్టడానికి రెండు వర్గాల ఖగోళ శాస్త్రవేత్తలు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు. మన గెలాక్సీలో మానవేతర గ్రహాంతర మేధస్సును కనుగొన్నట్లు ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Nasa Film Maker Simon Holland confirms over Alien life in space says revealed next month

భూమికి ఆవల ఉన్న నాగరికతల సాక్ష్యాలను కనుగొనే లక్ష్యంతో ప్రైవేట్‌గా నిధులు సమకూర్చిన శాస్త్రీయ పరిశోధన కార్యక్రమం తనతో దానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని పార్క్స్ టెలిస్కోప్‌ను ఉపయోగించి కొన్ని ఏళ్ల కితమే ఏలియన్స్ ఉన్నట్లు కొన్ని సాక్ష్యాలను కనుగొన్నారని వెల్లడించారు. అలాగే ఆక్స్‌ఫర్డ్ ఆధారిత ప్రాజెక్ట్ ఖగోళ శాస్త్రవేత్తలు మరొక ప్రపంచం నుండి ప్రసారాలకు స్పష్టమైన సాక్ష్యాలను గుర్తించారని హాలండ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న సాక్ష్యాలను ప్రచురించటానికి అవసరమైన సపోర్టింగ్ వాస్తవాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు మూవీ మేకర్ పేర్కొన్నారు.

ఈ పరిశోధనల్లో చైనీయులు ఇతరదేశాలను ఓడించటానికి ప్రయత్నించవచ్చని హాలండ్ అన్నారు. రేడియో తరంగ సిగ్నల్‌ను మొదట ఏప్రిల్ 2019లో ఆస్ట్రేలియాకు చెందిన పార్క్స్ టెలిస్కోప్ నుంచి 982 MHz ఫ్రీక్వెన్సీలో గుర్తించారు. భూమికి దాదాపు 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాక్సిమా సెంటారీ చుట్టూ ఉన్న ప్రాంతం నుండి సిగ్నల్ కనిపించింది. గ్రహాంతర వాసులు కేవలం తాము ఉన్నట్లు సందడి చేస్తున్నారు కానీ మేము ఇక్కడ ఉన్నామంటూ హాయ్ చెప్పటం లేదని హాలండ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+