NASA మైండ్ బ్లోయింగ్ ప్రయోగం! రోమన్ టెలిస్కోప్ సృష్టించబోయే సంచలనాలివే

అనంత విశ్వంలో దాగున్న నిగూఢ రహస్యాలను, డార్క్ ఎనర్జీ గుట్టును విప్పేందుకు అగ్రరాజ్యం అమెరికా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. నాసా రూపొందించిన అత్యంత ఖరీదైన 'నాన్సీ గ్రేస్ రోమన్' వ్యోమ నౌకను స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ నుంచి ఈ ప్రయోగం నిమిషాల వ్యవధిలో దిగ్విజయంగా పూర్తయింది. సుమారు $4.3 బిలియన్ల (రూ.35 వేల కోట్లకు పైగా) భారీ బడ్జెట్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ 5 నుంచి 10 సంవత్సరాల పాటు అంతరిక్షంలోని అద్భుతాలను శోధించనుంది. భూమికి దాదాపు 10 లక్షల మైళ్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుని, ఈ ఏడాది చివరి నుంచే తన పనిని ప్రారంభించనుంది.

విశ్వంలో కంటికి కనిపించకుండా, విశ్వ విస్తరణకు కారణమవుతున్న 'డార్క్ మ్యాటర్', 'డార్క్ ఎనర్జీ'ల పై పరిశోధనలు చేయడమే ఈ టెలిస్కోప్ ప్రధాన లక్ష్యం. విశ్వం ఆవిర్భావం నాటి నుండి ఉన్న భౌతిక నియమాలను లోతుగా అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడనుంది. దీనితో పాటు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న నక్షత్రాల చుట్టూ తిరిగే వింత గ్రహాలను (Exoplanets) శోధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. విశ్వంలో ఎక్కడైనా మన భూమి వంటి అనుకూల వాతావరణం ఉందా, జీవం మనుగడ సాధ్యమేనా అనే సంచలనాత్మక ప్రశ్నలకు ఈ ప్రయోగం ద్వారా సమాధానాలు లభించే అవకాశముంది.

NASA Launches Nancy Grace Roman Space Telescope via SpaceX Rocket to Hunt Dark Energy and Exoplanets

హబుల్ కంటే 1,000 రెట్లు వేగం.. 'మదర్ ఆఫ్ హబుల్' పేరుతో టెలిస్కోప్!

నాసా మొదటి మహిళా ఎగ్జిక్యూటివ్, 'మదర్ ఆఫ్ హబుల్'గా పేరొందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నాన్సీ గ్రేస్ రోమన్ జ్ఞాపకార్థం ఈ టెలిస్కోప్‌కు ఆమె పేరు పెట్టారు. గతంలో వాడిన హబుల్ టెలిస్కోప్‌తో పోలిస్తే ఇది 100 రెట్లు విస్తృతమైన అంతరిక్ష ప్రాంతాన్ని ఒకేసారి వీక్షించగలదు. అలాగే 1,000 రెట్లు వేగంగా ఖగోళ చిత్రాలను మ్యాపింగ్ చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే హబుల్ టెలిస్కోప్ 1,000 ఏళ్లలో సేకరించే సమాచారాన్ని ఈ రోమన్ టెలిస్కోప్ కేవలం 10 నెలల్లోనే సేకరించి పంపుతుంది. నక్షత్రాల కాంతిని అడ్డుకుని, పక్కనే ఉన్న చిన్న గ్రహాలను స్పష్టంగా చిత్రీకరించే 'కరోనాగ్రాఫ్' అనే ప్రత్యేక పరికరం ఇందులో అమర్చారు.

అడ్డంకులు దాటి నింగిలోకి.. తొలి ఫోటోలు 2027లోనే!

ఈ రోమన్ ప్రయోగం అంత సులభంగా ముందుకు సాగలేదు. 2010లో ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు బడ్జెట్ అంచనాలు పెరగడం, బడ్జెట్ కేటాయింపుల్లో రాజకీయ కోతలు విధించే ప్రయత్నాలు జరగడంతో పలు అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ నాసా వర్గాలు అన్ని సవాళ్లను దాటుకుని ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాయి. రానున్న మూడు నెలల పాటు టెలిస్కోప్‌లోని అన్ని పరికరాల పనితీరును పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి పరిశోధనలు ప్రారంభిస్తారు. ప్రయోగం అంతా అనుకున్నట్లు సాగితే, 2027 నాటికి ఈ రోమన్ టెలిస్కోప్ ద్వారా తీసిన మొదటి అద్భుతమైన చిత్రాలు మన ముందుకు రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+