సెప్టెంబర్‌లో టెక్ ఫెస్టివల్.. బిగ్ సేల్స్‌తో పాటు బిగ్ లాంఛ్‌లు !
సెప్టెంబర్ నెల టెక్నాలజీ ప్రేమికులకు ఒక ఫెస్టివల్ లాగా మారనుంది. ఈ నెలలో బిగ్ బిలియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వంటి భారీ ఆఫర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సేల్‌లు సెప్టెంబర్ 15 లోపు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా సేల్స్‌తో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ఈ నెలలో రిలీజ్ కానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
Apple..
ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా టెక్ ప్రపంచం Apple iPhone 17 సిరీస్ కోసం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న "Awe Dropping" ఈవెంట్లో iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, అలాగే కొత్త iPhone 17 Air ను ప్రకటించే అవకాశముంది. కొత్తగా A19/A19 Pro చిప్‌లు, 24MP ఫ్రంట్ కెమెరా, మెరుగైన iOS 26 ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు, Apple Watch Series 11, AirPods Pro 3 వంటి ప్రోడక్ట్స్ కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung..
సెప్టెంబర్ 4న Samsung Galaxy S25 FE లాంచ్ అవుతుందని సమాచారం. S24 FE తో పోల్చితే, కొత్త మోడల్‌లో 4,900 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, మెరుగైన కెమెరా సెట్ అప్ ఉంటాయి. అదనంగా, Galaxy Tab S11 కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉంది. FE సిరీస్ Samsung అభిమానులకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణే.
Motorola..
మొటరోలా కూడా ఈ నెలలో ఒక స్పెషల్ ఎడిషన్‌ను తీసుకురాబోతోంది. సెప్టెంబర్ 1న Motorola Razr 60 Brilliant Collection (Swarovski Edition) మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ డిజైన్‌లో 35 Swarovski క్రిస్టల్స్ ఉపయోగించారు. అసలు Razr 60 ఫీచర్లే ఇందులో ఉంటాయి కానీ లగ్జరీ ఫినిషింగ్‌తో ఇది ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
Realme..
సెప్టెంబర్ 2న భారత్‌లో Realme 15T 5G అధికారికంగా విడుదల కానుంది. ఈ ఫోన్‌లో Dimensity 6400 Max ప్రాసెసర్, 7,000 mAh భారీ బ్యాటరీ, 50MP AI కెమెరా సెటప్, 4,000 nits బ్రైట్నెస్ ఉన్న AMOLED డిస్ప్లే లాంటి ఫీచర్లు ఉంటాయి. ఇది IP69 రేటింగ్‌తో వస్తుందని కూడా రూమర్స్ చెబుతున్నాయి. ధర రూ.20,999 నుండి ప్రారంభమవ్వొచ్చు.
Oppo..
Oppo ఈసారి తన F-సిరీస్ లాంచ్‌లతో మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. ఇందులో F31, F31 Pro, F31 Pro Plus అనే మోడల్స్ ఉండనున్నాయి. ఇవన్నీ MediaTek ప్రాసెసర్స్‌తో వస్తాయి. 7,000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రధాన హైలైట్ అవుతుంది. F-సిరీస్ ఫోన్లు ఎక్కువగా ఆఫ్లైన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తాయని చెప్పొచ్చు.
Lava..
భారతీయ బ్రాండ్ Lava కూడా పోటీలో వెనుకబడటం లేదు. Lava Agni 4 సెప్టెంబర్ మధ్యలో విడుదల కానుంది. దీనిలో 7,000 mAh బ్యాటరీ, 66W ఛార్జింగ్, MediaTek Dimensity 850 ప్రాసెసర్, Full HD AMOLED డిస్ప్లే, 50MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. డిజైన్ పరంగా ఇది పాత Samsung Galaxy S10 సిరీస్‌ను గుర్తు చేస్తుందని చెబుతున్నారు.
మొత్తానికి, సెప్టెంబర్ 2025 మొబైల్ లవర్స్ కోసం ఒక బహుమతిలా రాబోతోంది. Apple నుంచి ప్రీమియం ఐఫోన్లు, Samsung నుంచి పాపులర్ FE సిరీస్, Motorola నుంచి లగ్జరీ ఎడిషన్, Realme & Oppo నుంచి మిడ్-రేంజ్ ఫోన్లు, Lava నుంచి పవర్‌ఫుల్ బ్యాటరీ ఫోన్.. ఇలా మంచి ఆప్షన్స్ తో కొత్త ఫోన్స్ లాంఛ్ కానుండడం టెక్ ప్రియులకు కలిసొచ్చే అంశం.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications