Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫోన్ అవసరం లేదు బ్రో.. కళ్లద్దాలతోనే యూపీఐ పేమెంట్స్!

Smart Glasses: ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్‌కార్ట్.. డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో పెనుమార్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. లెన్స్‌కార్ట్ తన అద్భుత ప్రొడక్ట్ అయిన "బి కెమెరా స్మార్ట్ గ్లాసెస్"లో డైరెక్ట్ యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అనుసంధానం చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ వినూత్న ఫీచర్‌ను ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2025 వేదికగా లెన్స్‌కార్ట్ ప్రపంచానికి పరిచయం చేసింది.

ఫోన్ అవసరం లేదు: వాయిస్ కమాండ్‌తోనే పేమెంట్
ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఇవి వినియోగదారులకు ఫోన్ లేదా పిన్ (PIN) లేకుండానే లావాదేవీలు నిర్వహించే సౌకర్యాన్ని కల్పిస్తాయి. స్మార్ట్‌గ్లాసెస్‌ను ధరించిన వినియోగదారులు, దుకాణాల్లోని క్యూఆర్ కోడ్‌ను కేవలం గ్లాసెస్‌తో స్కాన్ చేయడం ద్వారా లావాదేవీని ప్రారంభించవచ్చు.చెల్లింపు ప్రక్రియ పూర్తిగా వాయిస్ కమాండ్స్ ద్వారా పూర్తవుతుంది. "ఈ డైరెక్ట్ యూపీఐ ఇంటిగ్రేషన్ గ్లాసెస్‌ను వినియోగదారుడికి చెందిన బ్యాంక్ ఖాతాకు సురక్షితంగా అనుసంధానిస్తుంది. వాయిస్ కమాండ్‌ల ద్వారా మాత్రమే ప్రమాణీకరణ (Authentication), చెల్లింపు పూర్తవుతుంది" అని కంపెనీ వివరించింది. దీనివల్ల కొనుగోలు సమయంలో జేబులోంచి ఫోన్ తీయడం లేదా పిన్ నంబర్ మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

No Need for Phones UPI Payments with Smart Glasses by Lenscart

ఎన్‌పీసీఐ భాగస్వామ్యం: భద్రతకు పెద్ద పీట
ఈ వినూత్న చెల్లింపు వ్యవస్థ వెనుక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారం ఉంది. ఎన్‌పీసీఐ రూపొందించిన 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ద్వారా, వినియోగదారుల కళ్లద్దాలు నేరుగా, అత్యంత సురక్షితంగా వారి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానించబడతాయి. భద్రతకు, గోప్యతకు ఎటువంటి రాజీ లేకుండా ఈ లావాదేవీలు జరుగుతాయని లెన్స్‌కార్ట్ హామీ ఇచ్చింది.

బి కెమెరా స్మార్ట్‌గ్లాసెస్ ప్రత్యేకతలు

యూపీఐ చెల్లింపులతో పాటు ఈ బి కెమెరా స్మార్ట్‌గ్లాసెస్ అనేక అత్యాధునిక ఫీచర్లతో రానున్నాయి.

*ఆన్-ది-గో పాయింట్-ఆఫ్-వ్యూ (POV) కెమెరా: ప్రయాణంలో లేదా నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న దృశ్యాలను అదే కోణం నుండి రికార్డ్ చేయడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది.

*ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లు గ్లాసెస్ సామర్థ్యాన్ని పెంచుతాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

ఈ ప్రత్యేక ఫీచర్ల సమన్వయంతో యూపీఐ చెల్లింపుల ప్రక్రియ మరింత వినూత్నంగా, వేగంగా, అవాంతరాలు లేకుండా మారుతుంది. లెన్స్‌కార్ట్ ఈ 'బి కెమెరా స్మార్ట్‌గ్లాసెస్‌'ను రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్‌లో విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఆవిష్కరణ దేశీయ టెక్నాలజీ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+