Technology News: భారత్ సామర్థ్యంపై ఎన్విడియా CEO కీలక వ్యాఖ్యలు.. శ్రామికశక్తి ఎక్స్‌పోర్ట్‌పై ఆవేదన

Nvidia CEO: అత్యంత వేగంగా వృద్ధి చెందిన కంపెనీగా చిప్‌ మేకర్ ఎన్విడియా ఇటీవల చరిత్ర సృష్టించింది. ఒకానొక దశలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలను సైతం వణికించింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలను వెనక్కి నెడుతూ టాప్ 3 లోకి వచ్చి చేరింది. ఆ కంపెనీ CEO జెన్సన్ హువాంగ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సాంకేతిక యుగంలో భారత్ బ్యాక్ ఆఫీస్ పాత్రకు దిగజారకుండా ఎలా తప్పించుకోగలదని ప్రముఖ మీడియా సంస్థ హువాంగ్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. 'సాఫ్ట్‌వేర్ వేరే చోట నిర్మించబడుతున్నప్పుడు కార్మికులను ఎందుకు ఎగుమతి చేస్తున్నారు? ఇక్కడే దాన్ని తయారు చేసి ఎగుమతి చేయకూడదా?' అని తిరిగి క్వశ్చన్ చేశారు.

Nvidia CEO mesmorizing speach on India to lead AI innovation

భారతదేశం తన సొంత AI సామర్థ్యాలను ఇతర ప్రాంతాల్లో తయారుచేసే సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి అందిచడాన్ని జెన్సన్ హువాంగ్ తప్పు పట్టారు. శ్రమను ఇతరులకు ఎక్స్‌పోర్ట్ చేయడం కంటే స్థానిక నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారత్ నేరుగా AI ఆవిష్కరణలను సృష్టించడం మరియు వాటిని ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. భారీ IT విప్లవం సమయంలో బ్యాక్-ఆఫీస్ సర్వీస్ ప్రొవైడర్‌గా కాకుండా AI అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు.

'మీకు డేటా, శక్తి మరియు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దేశంలో ముడి డేటాను సేకరించి, దానిని మేధస్సుగా మార్చడానికి మీకు కీలకమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతిచోటా వారి ఫోన్‌లో హిందీని ఆస్వాదించే చాలా మంది భారతీయులు ఉన్నారు. ఆ టోకెన్‌లను ఇక్కడ భారతదేశంలో తయారు చేయాలి' అని హువాంగ్ సూచించారు.

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో 'Nemotron-4-Mini-Hindi-4B' అనే కొత్త హిందీ AI మోడల్‌ను హువాంగ్ ప్రారంభించారు. ఇది భారతదేశంలోని కంపెనీలు తమ సొంత AI మోడల్‌లను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. పరిశోధన, అభివృద్ధి మరియు పటిష్టమైన AI పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించడం ద్వారా 2 దశాబ్దాలుగా భారత సాంకేతిక రంగంలో Nvidia కీలక పాత్ర పోషిస్తోందని ఎన్విడియా CEO తెలిపారు. కేవలం IT సేవలపై ఆధారపడకుండా స్థానిక అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+