వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే ఫోన్
చైనాకు చెందిన వన్ ప్లస్ కంపెనీ ఎక్కువగా ప్రీమియం ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్ లోకి తెస్తుంది. తాజాగా ఈ కంపెనీ ఫ్యూచర్ రెడీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందకు సిద్ధమైంది. ప్రజలకు ఎంతో అవసరమైన అన్నిరకాల స్పెసిఫికేషన్లను అందించడమే ఫ్యూచర్ రెడీ ఉద్దేశం. దీంతోపాటు పెద్ద పెద్ద బ్యాటరీలతో స్మార్ట్ ఫోన్లను అందించే విషయంపై కూడా వన్‌ప్లస్ దృష్టిసారించింది.
1.5కె, 2కె రిజల్యూషన్
వన్‌ప్లస్ Ace 3 Pro ఫోన్ 6,100mAh బ్యాటరీతో విడుదల చేయడంతోపాటు ఒప్పో, వన్ ప్లస్ బ్రాండ్‌లపై దృష్టి సారించే ఔగా గ్రూప్ కంపెనీలు 6,500 mAh బ్యాటరీని విడుదల చేయనున్నారు. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్‌ఏస్ 4 గురించి కూడా సమాచారం అందించారు. కొత్త బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్ ప్రోటోటైప్ ను పరీక్షించేవిధంగా ఉంటుంది. ఈ ఫీచర్ ను అందించే మొదటి ఫోన్ అని, వన్ ప్లస్ ఏస్ 4, వన్ ప్లస్ 13లో 1.5K, 2K రిజల్యూషన్‌తో మైక్రో-కర్వ్డ్ ఫ్లాట్ డిస్‌ప్లేలను కలిగివుండబోతున్నాయి.

రీబ్రాండ్ చేయబోతున్నారు
ప్రపంచ మార్కెట్‌లో ఏస్ 4ని వన్‌ప్లస్ 13ఆర్‌గా రీబ్రాండ్ చేయనున్నారు. దీన్ని ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేయబోతున్నారు. 6,500 mAh బ్యాటరీని అందించే ఏకైక ఫోన్ ఇదొక్కటే కావడం గమనార్హం. 2025 మధ్యలో విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. వన్ ప్లస్ ఏస్ 3 ప్రో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, నానో-సిమ్ కార్డ్‌లను ఆమోదించే డ్యూయల్-సిమ్ తోపాటు టైటానియం మిర్రర్ సిల్వర్ కలర్, గ్రీన్ ఫీల్డ్ బ్లూ రంగుల్లో విడుదల కాబోతోంది. 2013 డిసెంబరులో వన్ ప్లస్ కంపెనీని పీట్ లా, కార్ల్ పీ స్థాపించారు. ప్రస్తుతం హై ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తోంది. ఇతర కంపెనీల కంటే అతి తక్కువ ధరలకు, హైక్వాలిటీని ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. 2014 ఏప్రిల్ 23న తన మొదటి స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.












Click it and Unblock the Notifications