OnePlus Nord CE 5: తడి చేతులతో టచ్ చేసినా పని చేస్తుంది
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రతి నెల కొత్త మోడల్స్ వస్తున్నా... నిజంగా యూజర్‌కు ఎక్కువకాలం ఉపయోగపడే ఫోన్‌లు మాత్రం చాలా తక్కువ. అలాంటి జాబితాలో ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 (OnePlus Nord CE 5) స్పష్టంగా చోటు దక్కించుకుంటోంది. భారీ బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్-లెవల్ డిస్‌ప్లే, స్టేబుల్ కెమెరా సెటప్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ - ఇవన్నీ కలిపి ఈ ఫోన్‌ను కేవలం తక్కువ ధరకే వస్తుంది. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్లతో బడ్జెట్ సెగ్మెంట్‌లో ఒక 'ఆల్‌రౌండర్'గా ఎలా నిలిచిందో చూడండి.
రూ.25 వేల లోపు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అసలు "లాంగ్ టర్మ్ వాల్యూ" అంటే ఏమిటన్న ప్రశ్నకు OnePlus Nord CE 5 స్పష్టమైన సమాధానంగా నిలుస్తోంది. వన్‌ప్లస్ నుంచి ఇటీవల విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీ, ప్రీమియం డిస్‌ప్లే, స్టేబుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఏకంగా ఆరు సంవత్సరాల అప్‌డేట్స్ హామీ ఇవ్వడం ద్వారా మిడ్-రేంజ్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 2025 జులైలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పటికే వినియోగదారుల నుంచి మంచి స్పందనను పొందుతోంది.
అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ..
ప్రస్తుతం OnePlus Nord CE 5 వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999గా ఉండగా, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.26,999కు, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.28,999కు విక్రయిస్తున్నారు. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై రూ.1,000 వరకు డిస్కౌంట్ అందించడంతో పాటు, ఈ ఫోన్ బ్లాక్ ఇన్ఫినిటీ, మార్బుల్ మిస్ట్, నెక్సస్ బ్లూ రంగుల్లో లభిస్తోంది.

తడి చేతులతో..
డిస్‌ప్లే పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు ఏమాత్రం తీసిపోదు. 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేకు 120Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఆక్వా టచ్ ఫీచర్ కారణంగా తడి చేతులతోనూ టచ్ రెస్పాన్స్ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కల్పించడం ద్వారా డిజైన్‌తో పాటు డ్యూరబిలిటీపై కూడా వన్‌ప్లస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్
పెర్ఫార్మెన్స్ విభాగంలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్ ఈ ఫోన్‌కు బలమైన హృదయంగా పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15పై నడిచే ఈ డివైస్ నాలుగు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తో పాటు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది. ఈ స్థాయి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ సాధారణంగా ప్రీమియం ఫోన్‌లకే పరిమితమవుతుండగా, ఈ ధరలో అందించడం Nord CE 5ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న హ్యాండ్‌సెట్‌గా మారుస్తోంది.
All style. All power. The #OnePlusNordCE5 has landed! Get your hands on it starting July 12th, 12 AM IST (Midnight) pic.twitter.com/kiyIJvS422
— OnePlus India (@OnePlus_IN) July 11, 2025
బైపాస్ ఛార్జింగ్
బ్యాటరీ విషయానికి వస్తే, OnePlus Nord CE 5 అసలు బలాన్ని ఇక్కడే చూపిస్తోంది. 7100mAh భారీ బ్యాటరీకి 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు బైపాస్ ఛార్జింగ్‌ను కూడా అందించింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే గంటలపాటు వీడియో స్ట్రీమింగ్ సాధ్యమవుతుందన్న కంపెనీ వాదన, హెవీ యూజర్లకు ఈ ఫోన్ ఎంత ఉపయోగకరమో చెప్పకనే చెబుతోంది.
సోనీ కెమెరాతో..
కెమెరా విభాగంలో వెనుకవైపు OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ సెన్సర్‌ను అందించగా, దానికి తోడుగా 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ముందు వైపు 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను అమర్చారు. 4K వీడియోలను 60fpsతో రికార్డ్ చేసే సామర్థ్యం ఉండటంతో పాటు, 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4, IR బ్లాస్టర్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ ఫోన్‌ను రూ.25 వేల సెగ్మెంట్‌లో ఒక సంపూర్ణ ప్యాకేజీగా నిలబెడుతున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications