7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Poco M7 Plus.. ఫీచర్స్ మామూలుగా లేవుగా !
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోకో (POCO) మరోసారి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. టెక్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పోకో ఫోన్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లో టీజర్‌ను విడుదల చేసిన ఈ సంస్థ.. "పవర్ ఫర్ ఆల్" అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్త ఫోన్ ను పరిచయం చేయనుంది. అధికారికంగా పేరు వెల్లడించకపోయినా.. ఇది Poco M7 Plus కావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్‌ను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు సమాచారం.
కాగా ఈ ఫోన్ ధర విషయానికి వస్తే రూ. 15,000 లోపే ఉండే అవకాశం ఉంది. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మరి ముఖ్యంగా 7,000mAh భారీ బ్యాటరీ, 6.79 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 58MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకర్షిస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో మరిన్ని అధికారిక వివరాలు వెల్లడి అవుతాయని భావిస్తున్నారు.

Poco M7 Plus ఫీచర్స్ ( లీకుల ప్రకారం )..
భారీ బ్యాటరీ..
- Poco M7 Plusలో 7,000mAh భారీ బ్యాటరీ ఉండనుంది.
- ఇది "Power for All" అనే ట్యాగ్‌లైన్ ద్వారా హింట్ ఇచ్చారు.
- 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుందని సమాచారం.
- ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ గంటలు ఉపయోగించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ప్రాసెసర్..
- ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ఉపయోగించనున్నారు.
- గేమింగ్, మల్టీటాస్కింగ్, హైఎండ్ యూజ్‌కి ఇది మరింత వేగవంతమైన పనితీరును అందిస్తుంది.
- బ్యాటరీ మేనేజ్‌మెంట్ కూడా మెరుగ్గా ఉండే అవకాశముంది.
డిస్‌ప్లే..
- Poco M7 Plusలో 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతోంది.
- గతంలో Poco M6 Plusలో ఉన్న 6.79 అంగుళాల 120Hz డిస్‌ప్లేతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉంటుంది.
- ఇది గేమింగ్, స్క్రోలింగ్ అనుభూతిని మినిమమ్ ల్యాగ్‌తో అందించనుంది.
డిజైన్..
- నల్లరంగు ఫినిష్, స్టైలిష్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఫోన్ లుక్ చాలా ట్రెండీగా ఉండనుంది.
రామ్, స్టోరేజ్..
- అధికారికంగా వెల్లడించకపోయినా, 6GB/8GB RAM, 128GB/256GB స్టోరేజ్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది.
కెమెరా..
- రియర్ కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా ఉండనుంది.
- ఫ్రంట్ కెమెరా: 8MP సెల్ఫీ కెమెరా లభించనుంది.
- గత ఏడాది M6 Plusలో 108MP+2MP సెటప్ ఉన్నప్పటికీ, M7 Plusలో మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు.
- సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి కూడా మంచి నాణ్యతను అందించనుంది.
అదనపు ఫీచర్లు..
- నీటి నిరోధకత కోసం IP53 రేటింగ్‌ను కలిగి ఉంది.
ధర..
- ఫోన్ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, లీకుల ప్రకారం Poco M7 Plus అనే పేరుతోనే లాంచ్ చేయనున్నారు. ధర రూ. 15,000 లోపే ఉండే అవకాశం ఉంది. గత ఏడాది Poco M6 Plus రూ.13,499కి లాంచ్ అయింది.
విడుదల తేదీ..
- ఫోన్ లాంఛ్ ఆగస్టు 13గా ఫిక్స్ అయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Poco M7 Plus మిడ్-రేంజ్ మార్కెట్‌లో మరోసారి పోకో స్టాంప్ చూపించే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, ట్రెండీ డిజైన్, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ ఫోన్ డిజైన్ ఉండడంతో ఫోన్ లాంఛ్ అయ్యే తేదీ కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications