రెండు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన "పోకో".. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ !!
కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే "పోకో" భారత్ లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. లేటెస్ట్ గా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోకో మరోసారి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దీర్ఘకాలం ఎదురు చూపులకు తెరదిస్తూ తమ సరికొత్త ప్రీమియం సిరీస్ Poco F8ను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేసింది.
ధరలు..
ఈ సిరీస్‌లో Poco F8 Ultra, Poco F8 Pro అనే రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక ప్రాసెసర్లు, అద్భుతమైన కెమెరాలు, భారీ బ్యాటరీలు, అగ్రశ్రేణి డిస్ ప్లేలు ఈ సిరీస్‌ను ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీదారులుగా నిలబెడుతున్నాయి. Poco F8 అల్ట్రా ధర 12GB + 256GB వేరియంట్‌కు $729 (సుమారు ₹65,100) నుంచి ప్రారంభమవుతుంది. 16GB + 512GB మోడల్ ధర $799 (సుమారు ₹71,300). తొలి ఆఫర్‌లో భాగంగా 12GB + 256GB వేరియంట్ $679 (సుమారు ₹60,600), 16GB + 512GB మోడల్ $729 (సుమారు ₹65,100)కి లభించనున్నాయి.

అలానే Poco F8 Pro ధర 12GB + 256GB వేరియంట్‌కు $579 (సుమారు ₹51,700), 12GB + 512GB మోడల్‌కు $629 (సుమారు ₹56,100) గా నిర్ణయించింది. తొలి ఆఫర్‌లో 12GB + 256GB వేరియంట్ $529 (సుమారు ₹47,200).. 12GB + 512GB మోడల్ $579 (సుమారు ₹51,700)గా తగ్గింపునకు పొందవచ్చు. మొదటి ఆరు నెలల్లో ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా ఉంది.
Poco F8 సిరీస్ ఫీచర్లు..
ప్రాసెసర్..
Poco F8 Ultra :
బ్రాండ్ న్యూ Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్
మెరుగైన AI పనితీరు, పవర్ ఎఫిషియెన్సీ
గేమింగ్‌కు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసిన GPU
Poco F8 Pro :
గత తరం అయినప్పటికీ ఇంకా టాప్-ఎండ్ క్లాస్ పనితీరు
హెవీ మల్టిటాస్కింగ్, గేమింగ్‌కి సులభంగా సపోర్ట్
Android 16 ఆధారిత HyperOS 3తో మరింత వేగవంతమైన UI అనుభవం
డిస్ ప్లే..
Poco F8 Ultra :
6.9" OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ - డైరెక్ట్ సన్‌లైట్‌లో కూడా స్పష్టమైన విజిబిలిటీ
HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్
Poco F8 Pro :
6.59" AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు, ఆంటీ-ఫ్లికర్ టెక్నాలజీ
కెమెరా..
Poco F8 Ultra :
50MP OIS ప్రైమరీ లెన్స్
50MP పెరిస్కోప్ టెలిఫోటో - 5x ఆప్టికల్ జూమ్
50MP అల్ట్రావైడ్ - 120° వైడ్ షాట్స్
32MP ఫ్రంట్ కెమెరా
Poco F8 Pro :
50MP OIS ప్రైమరీ సెన్సార్
50MP టెలిఫోటో (2.5x జూమ్)
8MP అల్ట్రావైడ్
20MP ఫ్రంట్ సెన్సార్
అదనంగా రెండు మోడళ్లలో 8K వీడియో రికార్డింగ్, నైట్ మోడ్ 3.0, AI పుట్రెయిట్ మోడ్ అప్డేట్స్, OIS + EIS డ్యుయల్ స్టెబిలైజేషన్ ఉన్నాయి.
బ్యాటరీ & ఛార్జింగ్..
Poco F8 Ultra :
6500mAh భారీ బ్యాటరీ
100W HyperCharge
50W వైర్‌లెస్ ఛార్జింగ్
రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో
Poco F8 Pro :
6210mAh బ్యాటరీ
100W వైర్డ్ HyperCharge
22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
ఆడియో & ఇతర ఫీచర్లు..
Bose ట్యూన్ చేసిన స్పీకర్లు - ప్రీమియం ఆడియో క్వాలిటీ
Wi-Fi 7, బ్లూటూత్ 5.4
NavIC సపోర్ట్
F8 Pro కి IP68 రేటింగ్ - నీటి & దుమ్ము నుండి పూర్తి రక్షణ
మెరుగైన హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
వెపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీ
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications