హిందూ మహా సముద్రంలో అనూహ్యం- తీరానికి పొంచివున్న గండం..
సముద్రపు నీటి రుచి ఎలా ఉంటుందనే ప్రశ్నకు- ఎదురయ్యే సమాధానం.. ఉప్పు. గుక్కెడు నీటిని కూడా తాగలేనంత ఉప్పుగా ఉంటాయవి. ముఖం కడుక్కోవడానికి కాదు కదా కనీసం పుక్కిలించడానికి కూడా పనికిరాదు. సముద్రపు జలాల్లో మునకలేసిన తర్వాత మన శరీరం ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు కూడా. వెంటనే సాధారణ నీటితో స్నానం చేయాలనిపించేంతగా చికాకును పుట్టిస్తాయక్కడి జలాలు.
సాల్ట్ కంటెంట్ వేగంగా తగ్గుతోంది..
ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రత్యేకించి హిందూ మహాసముద్రపు జలాల్లో ఉప్పు శాతం శరవేగంగా తగ్గుతోంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల జలాల్లో ఈ సాల్ట్ కంటెంట్ వేగంగా తగ్గుతోందని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. వర్షాలు కురవడానికి ఏకైక ఆధారమైన సముద్రపు ఉపరితల వాతావరణంలో సమతౌల్యం దెబ్బతింటుంది. అటు సముద్ర జీవులు సైతం మనుగడను సాగించడం ప్రశ్నార్థకమౌతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్ లో..
కొలరాడోలోని బౌల్డర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం దీనికి సంబంధించిన వివరాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్ లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత 60 ఏళ్లుగా పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు.. ప్రధాన గాలి నమూనా, సముద్ర ప్రవాహాలను మార్చాయని బౌల్డర్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు దక్షిణ భారత మహాసముద్రంలోకి అధిక మొత్తంలో మంచినీటిని తరలిస్తున్నాయని నిర్ధారించారు.
హిందూ మహాసముద్రం వేగంగా..
సముద్రపు జలాల్లో సాల్ట్ కంటెంట్ అనేది.. నీటి పొరల వ్యవస్థ, ఉష్ణ పంపిణీ, సముద్ర జీవనానికి కీలకమైన పోషకాలు ఉపరితలానికి చేరే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో దక్షిణ భారత హిందూ మహాసముద్రం వేగంగా మంచినీటిగా మారుతున్న ఈ ఆందోళనకర మార్పుపై శాస్త్రవేత్తలు నిశితంగా దృష్టి సారించారు. ఈ ధోరణి సముద్రం-వాతావరణం (ocean-atmosphere interaction), ప్రపంచ వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేసి, సముద్ర పర్యావరణ వ్యవస్థలపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
మంచినీటి ప్రవాహం ఎక్కువగా..
వాతావరణం- సముద్ర శాస్త్రాల విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెయికింగ్ హాన్ ఈ అంశంపై మాట్లాడారు. మంచినీరు సముద్రంలో కదిలే విధానంలో పెద్ద స్థాయి మార్పు చూస్తున్నామని పేర్కొన్నారు. సముద్రంలోకి వస్తున్న మంచినీటి ప్రవాహం ఎక్కువగా భారీ ఉష్ణమండల ప్రాంతం నుండి వస్తోందని గుర్తించారు. తూర్పు హిందూ మహాసముద్రం నుండి ఉత్తరార్ధగోళ పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించిన ఈ జోన్‌లో అధిక వర్షపాతం, తక్కువ ఓషన్ సర్కులేషన్ కారణంగా సహజ మంచినీటిగా వనరుగా భావిస్తారు.
ఇండో-పసిఫిక్ ఫ్రెష్ వాటర్ పూల్..
ఈ రీజియన్ ను ఇండో-పసిఫిక్ ఫ్రెష్ వాటర్ పూల్ గా పిలుస్తారు. ఇది థర్మోహాలైన్ ప్రసరణతో అనుసంధానించి ఉంటుంది. సముద్ర బేసిన్‌ల మధ్య వేడి, నేచురల్ డీసాలేషన్, మంచినీటిని తరలించే ఈ ప్రపంచ ప్రవాహ వ్యవస్థను 'కన్వేయర్ బెల్ట్'గానూ వర్ణిస్తారు. ఇండో-పసిఫిక్ నుండి వచ్చే వెచ్చని ఉపరితల జలాలు అట్లాంటిక్‌ను ప్రభావితం చేస్తాయి. ఉత్తర అట్లాంటిక్‌లో ఆ నీరు చల్లబడి, సాంద్రత పెరిగి, అడుక్కి చేరి, దక్షిణంగా ప్రవహించి, తిరిగి భారత, పసిఫిక్ మహాసముద్రాలకు చేరుతుంది. ఈ మార్పులు కూడా ఉప్పు నీటి సాంద్రతను నిర్ణయిస్తుంది.
గ్రీన్‌ల్యాండ్ ఐస్ షీట్, ఆర్కిటిక్ సముద్రపు మంచు కరగడం..
మరోవైపు గ్రీన్‌ల్యాండ్ ఐస్ షీట్, ఆర్కిటిక్ సముద్రపు మంచు కరగడం వల్ల ఉత్తర అట్లాంటిక్‌లోకి మంచినీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీనివల్ల థర్మోహాలైన్ ప్రసరణ నెమ్మదిస్తుందని వెయికింగ్ హాన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ఫ్రెష్ వాటర్ పూల్ నుంచి మరింత మంచినీరు హిందూ మహాసముద్రంలోకి తరలిరావడానికి ఇదీ ఓ ప్రధాన కారణమని అంచనావేసినట్లు చెప్పారు. సముద్ర జీవులకు హానికరమని, అవి మనుగడ సాగించడానికి అవసరమైన వనరులు తగ్గుతాయని పేర్కొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications