మరికాసేపట్లో.. నెలవంక చంద్రుడి వెనక్కి శుక్రుడు!

గగనతలంలో నేడు ఒక అరుదైన, అత్యంత ఆకర్షణీయమైన ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. చందమామ కాసేపటి పాటు అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసే 'శుక్ర గ్రహాన్ని' (Planet Venus) తన వెనుక దాచేసుకోనుంది. ఖగోళ శాస్త్రంలో ఈ వింతను 'లూనార్ అకల్టేషన్' (Lunar Occultation- చాంద్ర నిరోధం) అని పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యంలో ప్రకాశవంతమైన శుక్ర గ్రహం చందమామ చాటున దాగిపోయి.. దాదాపు ఒక గంట తర్వాత మళ్లీ ప్రత్యక్షం కానుంది. ఉత్తర అమెరికా ఖండంలో ఈ దృశ్యం అద్భుతంగా కనిపించబోతోంది.

అసలు ఏం జరగబోతోంది?

ప్రస్తుతం చంద్రుడు పెరుగుతున్న దశలో (Waxing Phase) ఉన్నాడు. ఈ క్రమంలో చంద్రుడు నేరుగా భూమికి, శుక్ర గ్రహానికి మధ్యలోకి రానున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమి-శుక్రుడి సరళరేఖ మధ్యలోకి రావడం వల్లే ఈ అకల్టేషన్ జరుగుతుంది. ఈ సమయంలో అంతరిక్షాన్ని గమనిస్తే.. శుక్ర గ్రహం మొదట చంద్రుడి చీకటి భాగం (Darker Side) వెనుకకు వెళ్లిపోయి మాయమవుతుంది. ఆ తర్వాత సరిగ్గా గంట వ్యవధిలో చందమామ వెలుగుతున్న భాగం (Lit-up Side) నుండి మళ్లీ బయటకు వస్తుంది.

Rare Lunar Occultation 2026 Moon to Hide Planet Venus in Broad Daylight Today Over North America Region

పగటి పూటే కనువిందు.. ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చు?

ఈ ఖగోళ వింత ఈరోజు పగటి పూట (డే లైట్) సంభవించనుంది. దీని ఖచ్చితమైన సమయాలు ఆయా ప్రాంతాల భౌగోళిక స్థానాన్ని బట్టి మారుతుంటాయి.

  • తూర్పు ఉత్తర అమెరికా: మధ్యాహ్నం 3:45 గంటలకు (EDT)
  • మధ్య ప్రాంతాలు: స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:45 గంటలకు
  • పశ్చిమ ప్రాంతాలు: సరిగ్గా మిడ్-డే (మధ్యాహ్నం) సమయంలో ఇది కనిపిస్తుంది
జూలై 17న ఆకాశంలో మునుపెన్నడూ చూడని వింత దృశ్యం!
జూలై 17న ఆకాశంలో మునుపెన్నడూ చూడని వింత దృశ్యం!

ఈ అద్భుత దృశ్యం ప్రధానంగా అమెరికా, కెనడా, ఉత్తర మెక్సికో, కరేబియన్ దీవులతో కూడిన ఉత్తర అమెరికా దేశాల్లో చాలా స్పష్టంగా కనిపించనుంది. స్థానిక వాతావరణ పరిస్థితులు సహకరిస్తే దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, వెనిజులా దేశాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు కూడా చంద్రుడు-శుక్రుడు అత్యంత దగ్గరగా జంటగా ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు.

చంద్రుడిపై లక్షల టన్నుల గుప్తనిధులు! కోట్ల ఏళ్లుగా దాచిన ఇంధనం
చంద్రుడిపై లక్షల టన్నుల గుప్తనిధులు! కోట్ల ఏళ్లుగా దాచిన ఇంధనం

పగటిపూట కనిపించడం ఎంతో అరుదు!

సాధారణంగా భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య రేఖల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు శుక్రుడి చాంద్ర నిరోధాలు (Lunar Occultations) జరుగుతుంటాయి. కానీ, అవి అన్ని ప్రాంతాల వారికి కనిపించవు. ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదు. జూన్ 17న చంద్రుడి అమరిక, భూమి కోణం ఖచ్చితంగా సరిపోవడంతో ఉత్తర అమెరికా ఖండం దీనికి ప్రధాన వేదికైంది. వీటన్నిటికంటే ముఖ్యంగా, నడిపగటి వెలుతురులోనే ఈ అద్భుతం స్పష్టంగా కనిపించనుండటమే ఈ ఈవెంట్‌ను అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది. ఖగోళ ప్రియులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+