రూ.6,499 కే బెస్ట్ ఫీచర్లతో రెడ్‌మీ బడ్జెట్‌ ఫోన్‌.. ఈరోజే లాంఛ్ !

తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ ఆఫర్ మీకోసమే. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో బెస్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూ మార్కెట్ పెంచుకుంటుంది రెడ్ మీ సంస్థ. అయితే తాజాగా భారత్‌లో మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ ఉండడంతో కస్టమర్లలో Redmi A5 ఫోన్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫీచర్ ఫోన్ లేదా పాత ఫోన్ ను మార్చాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Redmi A5 ఫీచర్స్..

డిస్‌ప్లే..

6.88 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తోంది.

ప్రాసెసర్..

ఈ ఫోన్‌ Octa-core T7250 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

స్టోరేజ్..

4GB RAMతో వస్తోంది. అదనంగా మరో 4GB వరకు వర్చువల్ RAMగా పెంచుకునే ఫీచర్‌ ఉంది. మెమొరీ కార్డ్‌ ద్వారా 1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంది. ప్రస్తుతం రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది

3GB RAM + 64GB Storage - ₹6,499

4GB RAM + 128GB Storage - ₹7,499

redmi-budget-phone-with-best-features-for-rs-6-499

కెమెరా..

ఫోన్ వెనుకవైపు 32MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ..

ఈ ఫోన్ లో 5,200 mAh బ్యాటరీ ఉంది, ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

రంగులు..

Redmi A5 స్మార్ట్‌ఫోన్‌ను పాండిచేరి బ్లూ, జస్ట్ బ్లాక్ కలర్ లలో లభిస్తుంది.

కనెక్టివిటీ విషయంలో ఇది వైఫై, బ్లూటూత్‌, USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియో వంటి అన్ని అవసరమైన ఫీచర్లను కలిగి ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
తక్కువ ఖర్చుతో బెస్ట్ ఫీచర్లను కోరుకునే వారికి Redmi A5 ఒక మంచి ఆప్షన్ అని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+