రోమన్ చక్రవర్తి రాయల్ బాత్‌రూమ్ సీక్రెట్స్! అప్పట్లోనే స్టీమ్ బాత్

రోమన్ సామ్రాజ్యపు వైభవం, నాటి రాజుల విలాసవంతమైన జీవనశైలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగుచూసిన ఒక పురాతన భవంతి ఆ కాలపు సాంకేతిక పరిజ్ఞానానికి, రాజభోగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నేటి సెర్బియా ప్రాంతంలో దాదాపు 1700 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తుశకం 310 ప్రాంతంలో నాటి రోమన్ చక్రవర్తి 'మాక్సిమినస్ దాతా' తన కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న ఒక అత్యంత రహస్య, విలాసవంతమైన ప్రైవేట్ బాత్ కాంప్లెక్స్ బయటపడింది. ఆ కాలంలోనే వేడి గాలి ప్రసరించే నేలలు, స్టీమ్ బాత్, మూడు స్విమ్మింగ్ పూల్స్ తో కూడిన ఈ నిర్మాణం చూసి నిపుణులు సైతం విస్మయానికి గురవుతున్నారు.

కోట గుమ్మటం కింద రాజభోగాలు!

సెర్బియాలోని 'వ్రెలో-షార్కమెన్' అనే చారిత్రక ప్రాంతంలో ఉన్న ఒక పురాతన కోట పునాదులను ఆర్కియాలజిస్టులు వెతుకుతుండగా ఈ అరుదైన నిర్మాణం బయటపడింది. సాధారణంగా రోమన్ల కాలంలో స్నానపు గదులు ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉంటాయి. కానీ ఈ చక్రవర్తి తన వ్యక్తిగత గోప్యత, రక్షణ కోసం కోట నైరుతి మూలన ఉన్న ఒక భారీ టవర్ కింద వృత్తాకారంలో దీనిని నిర్మించారు. ఈ గది పైన ఆరు కిటికీలతో కూడిన ఒక అందమైన డోమ్ ఉంది. రాజధాని దండయాత్రలు, దౌత్యపరమైన ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు చక్రవర్తి తన కుటుంబంతో కలిసి ఇక్కడ సమయం గడిపేవారని ఆధారాలు చెబుతున్నాయి.

Roman Emperor AD 310 Private Bath Discovery Uncovering 1700 Year Old Luxury Sauna and Heated Pool Complex

17 వందల ఏళ్ల క్రితమే 'హీటెడ్ ఫ్లోర్స్', స్టీమ్ బాత్!

ఈ పురాతన నిర్మాణం నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. ఇందులో నీటిని, గదులను వేడి చేసేందుకు ప్రత్యేకంగా ఫర్నేస్ (రాతి పొయ్యిలు) వ్యవస్థను ఏర్పాటు చేశారు. గది నేల భాగం కింద వేడి గాలి ప్రసరించడం ద్వారా ఫ్లోర్ ఎప్పుడూ వెచ్చగా ఉండేది. అంతేకాకుండా, నీటిని వేడి చేయడానికి ఒక రాగి బాయిలర్ బేస్, శరీరానికి ఆవిరి పట్టేందుకు ప్రత్యేక 'సుడాటోరియం' ( స్టీమ్ రూమ్) వేర్వేరు ఉష్ణోగ్రతలతో కూడిన మూడు ఈత కొలనులు ఇక్కడ లభ్యమయ్యాయి. కేవలం శుభ్రత కోసం కాకుండా, పూర్తి విశ్రాంతి కోసం ఒక క్లబ్ లాగా దీనిని డిజైన్ చేసుకున్నారు.

ADC పదవికి మేజర్ రిషభ్ రాజీనామా. రాష్ట్రపతి గురించి సంచలన విషయాలు
ADC పదవికి మేజర్ రిషభ్ రాజీనామా. రాష్ట్రపతి గురించి సంచలన విషయాలు

అంతర్గత పోరు వేళ రాజు ప్రశాంతత!

క్రీస్తుశకం 310 నుంచి 313 వరకు పాలించిన మాక్సిమినస్ దాతా కాలం రోమన్ సామ్రాజ్యంలో తీవ్ర రాజకీయ అస్థిరతలతో కూడుకున్నది. నలుగురు పాలకులు రాజ్యాన్ని పంచుకుని ఏలే 'టెట్రార్కీ' వ్యవస్థ పతనమవుతున్న రోజుల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. అంతటి తీవ్ర ఒత్తిడికరమైన వాతావరణంలో కూడా చక్రవర్తి తన రాజప్రాసాదంలో అంతర్గతంగా ఇటువంటి విలాసవంతమైన కేంద్రాన్ని నిర్మించుకోవడం విశేషం. అయితే ఆయన పాలన కొద్ది సంవత్సరాలే సాగి, ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. ఆయన నిర్మించిన ఈ అద్భుత కట్టడం 17 శతాబ్దాల పాటు భూమిపొరల్లో పదిలంగా దాగి ఉంది.

Xi Jinping వచ్చేశారు.. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు, 'రెడ్ బ్యానర్' కారు ప్రత్యేకతలు
Xi Jinping వచ్చేశారు.. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు, 'రెడ్ బ్యానర్' కారు ప్రత్యేకతలు

మరిన్ని రహస్యాలు వెలికితీసే దిశగా పరిశోధనలు

ఈ స్నానవాటిక కేవలం పాతకాలపు రాతి గోడలు మాత్రమే కాదని, వేగంగా మారిపోతున్న నాటి రోమన్ ప్రపంచపు జీవనచిత్రానికి అద్దం పడుతోందని సెర్బియన్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. చక్రవర్తి అంతఃపురం నుంచి ఈ అండర్‌గ్రౌండ్ బాత్ కాంప్లెక్స్‌కు వెళ్లేందుకు రహస్య దారులు ఏవైనా ఉన్నాయా? ఆ గదుల పూర్తి ఆకృతి ఎలా ఉండేది? అనే విషయాలపై పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+