Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సామ్‌సంగ్ గెలాక్సీ M17 5G లాంఛ్.. కేవలం రూ.11,999 !

మార్కెట్లో రోజూ ఒక కొత్త ఫోన్ లాంఛ్ అవుతూనే ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ లలో టాప్ బ్రాండ్స్ అంటే సామ్‌సంగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. సామ్‌సంగ్ సంస్థ తన కొత్త గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. కాగా ఆరు OS అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు.. 5,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. మిడ్-రేంజ్ 5G సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లను అందిస్తుండడం టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ M17 5G ఫీచర్లు..

డిజైన్..

  • గెలాక్సీ M17 5G ఆకర్షణీయమైన గ్లాస్ లుక్ ఫినిష్, సన్నని బీజెల్స్, మరియు కర్వ్డ్ ఎడ్జ్‌లతో వస్తోంది.
  • ఫోన్ బరువు 192 గ్రాములు, కొలతలు 75×77.9×164.4mmగా ఉన్నాయి.
samsung-galaxy-m17-5g-price-and-specifications-details

డిస్‌ప్లే..

  • ఇది 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
  • ఫుల్-HD+ (1080x2340 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, మరియు 1,100 నిట్స్ HBM పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
  • స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చబడింది,

ప్రాసెసర్..

ఈ ఫోన్‌కి శక్తినిచ్చేది శాంసంగ్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్, ఇది 5nm ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉండి, ఎనర్జీ ఎఫిషియెన్సీని పెంచుతుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7 ఉంటుంది.,

సాఫ్ట్‌వేర్..

శాంసంగ్‌ దీని కోసం ఆరు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనుంది. ఇది ఇతర బ్రాండ్‌ల కంటే స్పష్టమైన అడ్వాంటేజ్‌గా నిలుస్తోంది.

స్టోరేజ్..

ఫోన్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 1TB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది.

కెమెరా..

ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది:

  • 50MP ప్రధాన కెమెరా (OIS తో)
  • 5MP అల్ట్రావైడ్ లెన్స్
  • 2MP మాక్రో లెన్స్
  • ఈ కెమెరా సిస్టమ్‌ AI ఆధారిత ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్‌తో వస్తుంది. నైట్ మోడ్, పోర్ట్రెయిట్, ప్రో షూట్, స్లో-మో, సూపర్ స్టెడీ వీడియో వంటి మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
  • ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాతో HDR సపోర్ట్, ఫేస్ బ్యూటిఫికేషన్ ఫీచర్లు ఉన్నాయి.

AI & సెక్యూరిటీ ఫీచర్లు..

  • గెలాక్సీ M17 5Gలో గూగుల్ జెమిని లైవ్, సర్కిల్ టు సెర్చ్, ఆన్-డివైస్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి.
  • భద్రత విషయానికి వస్తే, ఇది శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌తో వస్తోంది. అదనంగా, వాయిస్ ఫోకస్, శాంసంగ్ వాలెట్, మరియు ట్యాప్ అండ్ పే వంటి సౌకర్యాలు కూడా లభ్యమవుతాయి.

బ్యాటరీ & కనెక్టివిటీ..

  • ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది, ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజులు వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
  • P54 రేటింగ్తో దుమ్ము, నీటి నిరోధకత కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
  • కనెక్టివిటీ ఫీచర్లలో బ్లూటూత్ 5.3, NFC, Wi-Fi 6, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ధరలు & ఆఫర్లు..

  • శాంసంగ్ గెలాక్సీ M17 5G భారతదేశంలో రూ.12,499 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది.
  • 6GB RAM వేరియంట్ - రూ.13,999
  • 8GB RAM వేరియంట్ - రూ.15,499
  • లాంచ్ ఆఫర్‌లలో భాగంగా, కంపెనీ వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, మూడు వేరియంట్లు వరుసగా రూ.11,999, రూ.13,499, రూ.14,499కే లభిస్తాయి.
  • ఈ ఫోన్ అక్టోబర్ 13 నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది.

రంగులు..

  • మూన్‌లైట్ సిల్వర్
  • సాఫైర్ బ్లాక్

ఈ ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ నోట్ 13 5G, రియల్‌మీ 12+, ఐకూ Z9 5G వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వబోతోంది. అయితే శాంసంగ్ బ్రాండ్ విశ్వసనీయత, దీర్ఘకాలిక సపోర్ట్, OIS కెమెరా, AMOLED డిస్‌ప్లే వంటి అంశాలు గెలాక్సీ M17 5Gను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+