నేడు చీకటి పడ్డాక శని దర్శనం.. భూమికి అత్యంత దగ్గరగా వచ్చి ఏం చేస్తాడంటే

ఖగోళ ప్రేమికులకు, ప్రజలకు నింగిలో ఒక అరుదైన విందు చూడబోయే అద్భుత సమయం ఆసన్నమైంది. సౌర కుటుంబంలో అత్యంత అందమైన గ్రహంగా పేరుగాంచిన 'శని' (Saturn) ఆదివారం భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. సూర్యుడికి, శని గ్రహానికి మధ్యలో భూమి ఒకే సరళరేఖపైకి రావడంతో ఈ అరుదైన ఖగోళ వింత చోటుచేసుకోనుంది. దీనిని సైంటిఫిక్ పరిభాషలో 'శాటర్న్ అపోజిషన్' (Saturn Opposition) అని పిలుస్తారు. ఈ ప్రత్యేక అమరిక కారణంగా శని గ్రహం పరిమాణంలో మునుపెన్నడూ లేనంత పెద్దదిగా కనిపించడమే కాకుండా, మనకి ఎంతో ప్రకాశవంతంగా దర్శనమివ్వనుంది.

ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీరఘునందన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 'శాటర్న్ అపోజిషన్' ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:59 గంటలకు సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తుంటే, తూర్పు దిక్కున శని గ్రహం ఉదయిస్తుంది. అలాగే తెల్లవారుజామున సూర్యుడు తూర్పున ఉదయించగానే పశ్చిమాన శని అస్తమిస్తుంది. అంటే, భానుడికి పూర్తిగా ఎదురుగా నిలబడటం వల్ల ఈ అందమైన దృశ్యం ఆదివారం రాత్రంతా ఆకాశంలో మెరుస్తూ అలరించనుంది.

Saturn Opposition 2026 Ringed Planet to Appear Brightest and Closest to Earth Tonight in Sky Event
గ్రహాల లిస్టులో లేకున్నా సంచలనాలే... ప్లూటోపై బయటపడ్డ కొత్త ద్రవం!
గ్రహాల లిస్టులో లేకున్నా సంచలనాలే... ప్లూటోపై బయటపడ్డ కొత్త ద్రవం!

ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి పెద్ద పెద్ద పరికరాలు ఏమీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత తూర్పు ఆకాశం వైపు చూస్తే స్పష్టంగా శని గ్రహాన్ని గుర్తించవచ్చు. అర్ధరాత్రి వేళ దక్షిణ దిశగా నిలబడి పైకి చూస్తే ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో మెరుస్తూ కనిపిస్తుంది. ఇక తెల్లవారుజామున పశ్చిమ-దక్షిణ-పశ్చిమ దిశలో దీనిని చూడవచ్చు. సాధారణ టెలిస్కోప్‌లు ఉన్నవారు చూస్తే శని చుట్టూ ఉన్న అందమైన రింగుల అమరిక మరింత అద్భుతంగా దర్శనమిస్తుంది.

అక్టోబర్ లో ఈ రాశులవారికి కష్టాల తుఫాన్.. శని, చంద్రుల కలయికతో జాగ్రత్త!
అక్టోబర్ లో ఈ రాశులవారికి కష్టాల తుఫాన్.. శని, చంద్రుల కలయికతో జాగ్రత్త!

కోట్ల కిలోమీటర్ల దూరం తగ్గిన వేళ: మళ్లీ 2027లోనే!

భూమి, శని గ్రహాల కక్ష్యలు అండాకారంలో ఉండటం వల్ల వాటి మధ్య దూరం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. సాధారణంగా శని గ్రహానికి, భూమికి మధ్య గరిష్ఠ దూరం సుమారు 165.86 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ అపోజిషన్ సమయంలో ఇది తగ్గి కేవలం 120.55 కోట్ల కిలోమీటర్ల సమీపానికి వస్తుంది. గతంలో ఈ అపూర్వ ఘట్టం 2025 సెప్టెంబర్ 21న జరగ్గా, మళ్లీ 2027 అక్టోబర్ 18న మాత్రమే రానుంది. అందుకే ఈ ఏడాదిలోనే శని గ్రహాన్ని ఇంత దగ్గరగా, స్పష్టంగా చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+