Wi-Fi: రూపాయి ఖర్చు లేకుండా ఈ చిన్న ట్రిక్ తో వైఫై స్పీడ్ డబుల్!

ఇంట్లో ఒక రూమ్‌లో వైఫై సిగ్నల్స్ ఫుల్‌గా వస్తూ.. పక్క రూమ్‌కి వెళ్లేసరికి నెట్ స్లో అయిపోవడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇలాంటి సమయంలో వెంటనే అందరికీ వచ్చే ఆలోచన.. కొత్త రూటర్ కొనడమో లేదా వేల రూపాయలు ఖర్చు పెట్టి మెష్ సిస్టమ్స్ (Mesh Systems) ఏర్పాటు చేయడమో చేస్తుంటారు.

అయితే, ఈ ఖర్చుల జోలికి వెళ్లకుండా మీ వంటగదిలో ఉండే ఒక చిన్న వస్తువుతో వైఫై స్పీడ్ ను అద్భుతంగా పెంచుకోవచ్చు. మన ఇళ్లలో సాధారణంగా వాడే అల్యూమినియం ఫాయిల్ (Aluminium Foil) పేపర్‌తో వైఫై సిగ్నల్‌ను పెంచవచ్చని అమెరికాలోని ప్రసిద్ధ 'డార్ట్‌మౌత్ కాలేజ్' కంప్యూటర్ సైన్స్ పరిశోధకులు సైంటిఫిక్‌గా నిరూపించారు.

Save Money on New Routers How Aluminium Foil Reflector Can Increase Your Wi-Fi Speed at Home Today

సిగ్నల్ ఎందుకు బలహీనపడుతుంది?

సాధారణంగా వైఫై రూటర్లు తమ సిగ్నల్స్‌ను అన్ని వైపులా ఒకేలా సమానంగా ప్రసారం చేస్తాయి. దీనివల్ల మనకు అవసరం లేని గోడల వైపు, ఖాళీ ప్రదేశాల వైపు సిగ్నల్స్ వృథాగా వెళ్ళిపోతుంటాయి. ఫలితంగా మనం కూర్చుని పని చేసే చోటకి వచ్చేసరికి సిగ్నల్ బలం తగ్గిపోతుంది. రూటర్‌ను మూలల్లో లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పక్కన పెట్టడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఈ వృథా అయ్యే సిగ్నల్‌ను మనకు కావలసిన వైపు మళ్లించడమే ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్ యొక్క అసలు రహస్యం.

Jio నుంచి అదిరిపోయే అప్‌డేట్, ఇక మారుమూల పల్లెల్లోనూ..
Jio నుంచి అదిరిపోయే అప్‌డేట్, ఇక మారుమూల పల్లెల్లోనూ..

అద్దంలా పనిచేసే అల్యూమినియం ఫాయిల్

వైఫై సిగ్నల్స్ అనేవి రేడియో తరంగాలు. కాంతి కిరణాలు అద్దంపై పడి ఏ విధంగా పరావర్తనం చెందుతాయో, అదే విధంగా ఈ రేడియో తరంగాలు కూడా అల్యూమినియం లాంటి లోహం పై పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక అల్యూమినియం ఫాయిల్‌ను వంకరగా (C-Shape) మార్చి రూటర్ యాంటెన్నా వెనుక పెట్టడం ద్వారా.. వేరే వైపు వెళ్లే సిగ్నల్స్ అన్నీ మనకు నెట్ కావలసిన గది వైపునకు ప్రసారమవుతాయి. సరైన కోణంలో దీనిని అమర్చడం ద్వారా సిగ్నల్ స్పీడ్ ఏకంగా 55 శాతం వరకు పెరుగుతుందని క్షేత్రస్థాయి పరిశోధనల్లో తేలింది.

ఇంట్లోనే సిగ్నల్ బూస్టర్ తయారు చేసుకోండిలా:

  • మొదట 8x10 ఇంచుల పరిమాణంలో ఒక గట్టి కార్డ్‌బోర్డ్ (అట్ట ముక్క)ను తీసుకోండి.
  • దానిపై అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను నీట్‌గా అంటించండి (మెరిసే భాగం పైకి ఉండేలా చూసుకోవాలి).
  • ఇప్పుడు ఆ అట్ట ముక్కను ఫ్లాట్‌గా ఉంచకుండా, కొద్దిగా లోపలికి వంచి 'C' ఆకారంలోకి లేదా డిష్ యాంటెన్నా లాగా మార్చండి.
  • ఈ సెటప్ ను రూటర్ యాంటెన్నా వెనుక భాగంలో అమర్చాలి. వంపు తెరిచి ఉన్న వైపు.. మీకు ఏ గదిలోనైతే సిగ్నల్ బలహీనంగా ఉందో ఆ వైపునకు ఉండేలా చూసుకోవాలి.
  • ఆ తర్వాత మీ మొబైల్‌లో స్పీడ్ చెక్ చేసుకుంటూ.. సిగ్నల్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు ఆ అట్ట ముక్క కోణాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయాలి.

ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఈ ట్రిక్ వాడేటప్పుడు అల్యూమినియం ఫాయిల్‌ను రూటర్‌కు పూర్తిగా చుట్టేయకూడదు. అలా చేస్తే రూటర్ లోపల వేడి బయటకు పోక పాడైపోయే ప్రమాదం ఉంది. కేవలం యాంటెన్నా వెనుక ఒక గోడలా మాత్రమే దీనిని ఉంచాలి. అలాగే, మీ ఇంట్లో లావుపాటి కాంక్రీట్ గోడలు లేదా పిల్లర్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఈ ట్రిక్ పని చేయదు. ఎందుకంటే ఇది ఉన్న సిగ్నల్‌ను మాత్రమే మళ్లిస్తుంది తప్ప కొత్తగా సిగ్నల్స్‌ను పుట్టించలేదు.

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కలిగిన దేశం ఏదో తెలుసా..?
ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కలిగిన దేశం ఏదో తెలుసా..?

వైఫై స్పీడ్ పెంచే మరికొన్ని చిట్కాలు:

  • రూటర్‌ను నేలపై లేదా మూలల్లో పెట్టకుండా.. ఇంటికి మధ్యలో, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచండి.
  • మైక్రోవేవ్ ఓవెన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, బేబీ మానిటర్ల వంటి వస్తువులకు మీ రూటర్‌ను దూరంగా ఉంచాలి.
  • స్మార్ట్ టీవీలు, డెస్క్‌టాప్ కంప్యూటర్ల వంటి స్థిరంగా ఉండే పరికరాలకు నేరుగా వైఫై కాకుండా ఇథర్నెట్ కేబుల్ (Ethernet Cable) వాడటం వల్ల వైఫైపై భారం తగ్గి మిగతా ఫోన్లకు స్పీడ్ పెరుగుతుంది.

కొత్త రూటర్ కోసం వేల రూపాయలు తగలేసే ముందు, రూపాయి ఖర్చు లేని ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌ను ఒకసారి ప్రయత్నించి చూడటం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+