పిడుగుల శబ్దంతో భూగర్భ రహస్యాలు గుట్టురట్టు.. శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం!

ఆకాశంలో గర్జించే పిడుగులు కేవలం భయాన్ని కలిగించడమే కాదు.. భూమి పొరల్లో దాగున్న రహస్యాలను కూడా బయటపెట్టగలవని సైంటిస్టులు నిరూపించారు. ఆకాశం నుంచి తీవ్రమైన ధ్వని తరంగాలు భూమిని తాకినప్పుడు ఏర్పడే ప్రకంపనాలను 'థండర్ క్వేక్స్' అంటారు. అమెరికాలోని పెన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూభౌతిక శాస్త్రవేత్త టైయువాన్ జూ నేతృత్వంలోని బృందం ఈ వినూత్న పరిశోధన చేపట్టింది. సుమారు రెండున్నరేళ్ల పాటు ప్రయోగశాలల కింద జరిగే 450కి పైగా ఉరుముల ప్రకంపనాలను రికార్డు చేసి, భూగర్భ నిర్మాణంపై అత్యంత కచ్చితమైన వివరాలను సేకరించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఎలాంటి ఖరీదైన కొత్త పరికరాలను వాడకపోవడం గమనార్హం. కేవలం భూమి కింద ప్లాస్టిక్ పైపుల్లో వేసిన ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ వైర్లను సెన్సార్లుగా మార్చేశారు. ఉరుముల ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించి భూమిని తాకినప్పుడు, మనకు తెలియని చిన్న తరహా భూకంప ప్రకంపనాలు ఏర్పడతాయి. ఈ సూక్ష్మ తరంగాల వల్ల భూమి కింద ఉన్న ఫైబర్ కేబుళ్లు స్వల్పంగా సాగుతాయి. ఆ సమయాన్ని రికార్డు చేయడం ద్వారా భూగర్భంలో దాదాపు 100 మీటర్ల లోతు వరకు ఉన్న పరిస్థితులను ఎక్స్-రే తీసినట్లుగా మ్యాపింగ్ చేయగలిగారు.

Scientists Use Thunderquakes and Fiber Optic Cables to Map Underground Hazards and Sinkholes Safely
ఆవులు, గేదెలకు సరికొత్త గుర్తింపు. అధికారిక జాబితాలోకి 16 జంతు జాతులు!
ఆవులు, గేదెలకు సరికొత్త గుర్తింపు. అధికారిక జాబితాలోకి 16 జంతు జాతులు!

సింక్‌హోల్స్, ప్రమాదకర గుహల గుర్తింపు

పెన్సిల్వేనియాలోని ఈ క్యాంపస్ సున్నపురాయి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిర్మితమైంది. దీనివల్ల లోపల రహస్య గుహలు, నీటి ప్రవాహాల వల్ల సున్నపురాయి కరిగిపోయి 'సింక్‌హోల్స్' (భూమి ఒక్కసారిగా కుంగిపోయే ప్రమాదకర గుంతలు) ఏర్పడే అవకాశాలు ఎక్కువ. శాస్త్రవేత్తలు థండర్ క్వేక్స్ డేటా సహాయంతో భూమి కింద ఎవరికీ తెలియని బలహీనమైన ముప్పు ప్రాంతాలను విజయవంతంగా గుర్తించారు. సాటిలైట్ డేటా, బోరు బావుల ద్వారా వచ్చిన ఫలితాలను పోల్చి చూసి తమ పరిశోధన నూరు శాతం నిజమని నిరూపించారు.

Texas: ఒక్క రాత్రిలోనే 150 ఇళ్లను కాపాడిన వింత ప్రాజెక్ట్! వరదల్ని ఆపిన తటాకాలు
Texas: ఒక్క రాత్రిలోనే 150 ఇళ్లను కాపాడిన వింత ప్రాజెక్ట్! వరదల్ని ఆపిన తటాకాలు

అంతరిక్ష ప్రయోగాలకు కూడా ఉపయోగకరం!

సాధారణంగా భూమి కింద ఏముందో తెలుసుకోవడానికి కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేక భూకంప పరికరాలను వాడాల్సి వస్తుంది. కానీ, ఉరుముల ద్వారా వచ్చిన డేటాను కేబుళ్ల ద్వారా సేకరించడం వల్ల నగరాల్లో తక్కువ ఖర్చుతోనే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించవచ్చు. అంతేకాక, నిరంతరం భారీ తుఫాన్లు సంభవించే శని గ్రహపు ఉపగ్రహమైన 'టైటాన్' వంటి ఇతర ఖగోళ గ్రహాలపై కూడా భూగర్భ పరిశోధనలకు ఈ విధానం అద్భుతంగా తోడ్పడుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+