చివరి నిమిషంలో ఆగిన 'విక్రమ్-1' ప్రయోగం! మళ్లీ కౌంట్‌డౌన్

భారత అంతరిక్ష రంగానికి సరికొత్త దిశను చూపిస్తూ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమైన 'మిషన్ ఆగమన్' ప్రయోగానికి చివరి నిమిషంలో బ్రేక్ పడింది. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన దేశీయ తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11:30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే, కౌంట్‌డౌన్ ముగిసే సమయానికి రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు నిపుణులు గుర్తించారు.

Skyroot Vikram-1 Rocket Launch Delayed Due to Technical Snag Check Mission Aagaman Details Here Now

చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగానికి లైన్ క్లియర్ అయింది. రాకెట్‌లో ఏర్పడిన లోపాన్ని స్కైరూట్, ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా సరిదిద్దారు. లోపాన్ని అధిగమించిన వెంటనే శాస్త్రవేత్తలు మళ్లీ కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.

నేడే అంతరిక్షంలోకి విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్: అరుదైన డైమండ్ లోటస్
నేడే అంతరిక్షంలోకి విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్: అరుదైన డైమండ్ లోటస్

ముందుగా అనుకున్న సమయం ఉదయం 11:30 కంటే దాదాపు 35 నిమిషాల ఆలస్యంగా, మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ చారిత్రాత్మక రాకెట్ శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపేందుకు యత్నిస్తున్నారు. సాంకేతిక సమస్య వీడటంతో షార్ వేదికగా మిషన్ ఆగమన్ ప్రయోగాన్ని వీక్షించేందుకు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+