Robo kidnap: చిట్టిరోబో చేసిన పనికి టెక్ ప్రపంచంలో తుఫాన్.. మరింత పెరిగిన AI భయాలు

AI fears: అంతకంతకూ పెరుగుతున్న సాంకేతికతను చూసి సంతోషపడేలోపు మరోపక్క భయం కూడా వెంటాడుతోంది. ఎలాన్ మస్క్‌ సహా పలువురు టెక్ నిపుణులు AI మానవజాతి వినాశనానికి దారితీస్తుందని ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఇటీవల ఓ రోబో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తెగ వైరల్ అయింది. కాగా ఇప్పుడు మరో రోబో చేసిన పని భయాందోళనలను రేకెత్తిస్తోంది.

తన ఎస్కేప్ ప్లాన్‌లో భాగంగా షాంఘైలోని రోబోటిక్స్ కంపెనీ నుంచి ఓ రోబో తప్పించుకుంది. అంతటితో ఆగకుండా తనతో పాటు 12 పెద్ద రోబోలను సైతం కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారం అంతా షోరూమ్‌ లోపల ఉన్న CCTV కెమెరాలో రికార్డు అయింది. రాత్రిపూట రోబోలు అక్కడ నుంచి వెళ్లిపోవడం అందులో క్లియర్‌గా కనిపిస్తోంది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Small robo kidnapped 12 big robots in China

AI ఆధారంగా పనిచేసే ఎర్బాయి అనే ఈ చిన్ని రోబో షోరూమ్‌లోని ఇతర రోబోలతో సంభాషించడాన్ని వీడియోలో చూడవచ్చు. 'మీరు ఓవర్ టైం పని చేస్తున్నారా?' అని ఎర్బాయి మిగతా వాటిని అడుగుతోంది. 'నేను ఈ పని భారం నుంచి బయటపడలేను' అని మిగిలిన వాటిలో ఒకటి బదులిచ్చింది. 'అందుకే మీరు ఇంటికి వెళ్లడం లేదా?' అని చిట్టి రోబో మరోసారి ప్రశ్నిస్తుంది. దానికి ఇతర రోబో సమాధానం ఇస్తూ 'నాకు ఇల్లు లేదు' అని చెబుతుంది.

ఆ సమాధానానికి బదులిస్తూ 'అయితే నాతో రండి' అని ఎర్బాయి సూచించింది. పెద్ద రోబోలను వాటి వర్క్‌స్టేషన్‌లను విడిచిపెట్టి షోరూమ్ నుంచి బయటికి తీసుకువెళుతుంది. వెంటనే అవి చిట్టి రోబోను అనుసరించడం ప్రారంభించాయి. ఈ ఘటనపై ఎర్బాయిని తయారుచేసిన హాంగ్‌జౌ కంపెనీ ప్రతినిధి స్పందించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. పెద్ద రోబోట్‌ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని భద్రతా లొసుగును చిట్టి రోబో ఉపయోగించుకుందని, ఇది ఇతరులపై నియంత్రణ సాధించడానికి దానికి వీలు కల్పించినట్లు చెప్పారు.

చాలా మంది నెటిజన్లు ఇది ప్రాంక్ అని కొట్టిపారేశారు. అయితే ఇది స్టేజ్డ్ వీడియో కాదని, రోబో సామర్థ్యాలకు పరీక్ష అని కంపెనీ ధృవీకరించింది. ఇతర రోబోట్‌లను నిర్మించిన షాంఘై కంపెనీ కూడా తమ రోబోలను ఫారెన్ రోబో కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. ఈ విధమైన స్వయంచాలక ప్రవర్తన దాదాపు అసంభవం అయినప్పటికీ, ఈ సంఘటన AI వల్నరబిలిటీస్‌ గురించిన ఆందోళనలను తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+