సూపర్ ఫీచర్లతో కేవలం రూ.6,499 లకే స్మార్ట్ ఫోన్..
మారుతున్న కాలానుగుణంగా నేటి ప్రపంచంలో మొబైల్ ఫోన్స్ లో పెద్ద ఎత్తున కాంపిటీషన్ నడుస్తోంది. తమ బ్రాండ్ ని మరింత పెంచుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పోకో C71 ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 4G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంఛ్ చేయడం కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది.
POCO సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71 ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ తక్కువ ధరకే ఈ ఫోన్ రిలీజ్ చేయగా.. 6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్ ప్లేతో వస్తుంది. TUV Rheinland సర్టిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు, లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్కేడియన్ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వెట్ టచ్ డిస్‌ప్లే సదుపాయం కూడా ఇందులో ఉండడం మరింత ప్లస్ అని చెప్పాలి. దీంతో తడిగా ఉన్న చేతులతో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.

POCO C71 ఫోన్ ఫీచర్స్...
డిస్ ప్లే..
6.88 అంగుళాల HD+ 120Hz ఉన్న భారీ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తుంది.
కెమెరా..
32MP బ్యాక్ కెమెరా , సెకండరీ కెమెరా, LED ఫ్లాష్, అలాగే 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
స్టోరేజ్..
4GB ర్యామ్ + 64GB రోమ్, 6GB ర్యామ్ + 128GB రోమ్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా 6GB వరకు ర్యామ్‌తో పాటు 6GB వరకు వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది.
ప్రాసెసర్..
ఇక ఈ ఫోన్ Android 15 తో విడుదల అవుతోంది. Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 1.8 GHz Octa-Core Unisoc T7250 12nm ప్రాసెసర్, Mali-G57 MP1 GPUను కలిగి ఉంది. POCO కంపెనీ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇచ్చింది.
బ్యాటరీ..
5200mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
ధర..
ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,499 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా కంపెనీ నిర్ణయించింది కంపెనీ. ఈ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, ఎయిర్టెల్ వినియోగదారుల కోసం POCO C71 కేవలం రూ. 5,999కి ప్రత్యేక ఆఫర్ కింద పొందవచ్చు.
మరోవైపు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ లో USB Type-C పోర్ట్, IP52 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, 3.5mm ఆడియో జాక్ కలిగి ఉన్నాయి.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications