పాము పేగుల్లో అద్భుతం.. కొండచిలువ నుంచి వెయిట్ లాస్ సీక్రెట్!
ప్రకృతిలో పాముల ఆహారపు అలవాట్లు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఒకేసారి తన శరీర బరువుతో సమానమైన జంతువును మింగేయడం, ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అసలు ఆహారమే ముట్టకుండా ఉండటం వాటికే సాధ్యం. అయితే, పాము కడుపు నిండిన తర్వాత దాని మెదడుకు 'ఇక చాలు' అని సంకేతాలు పంపే ఆ రహస్యం ఏమిటి?
ఈ ప్రశ్ననే పెట్టుబడిగా పెట్టిన శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమైన అణువు (Molecule) దొరికింది. ఇది మానవ ఊబకాయ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతోందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ pTOS Molecule? పాము పేగుల్లోని అద్భుతం!
బర్మన్ పైథాన్‌ల (కొండచిలువలు) రక్త నమూనాలను సేకరించిన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అవి ఆహారం తీసుకున్న కొన్ని గంటల్లోనే ఒక ప్రత్యేకమైన మెటబోలైట్ స్థాయి 1,000 రెట్లు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీనికి pTOS (para-Toluenesulfonic acid) అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే, ఈ అణువు నేరుగా పాము పేగుల్లోని బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలోకి విడుదల కాగానే పాముకు విపరీతమైన ఆకలిని చంపేసి, జీవక్రియను వేగవంతం చేస్తుంది.
ఎలుకలపై ప్రయోగం.. బరువులో భారీ తగ్గుదల!
ఈ pTOS అణువును ఊబకాయంతో బాధపడుతున్న ఎలుకలకు ఇచ్చి పరీక్షించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఈ అణువు ప్రభావంతో ఎలుకలు ఆహారం తీసుకోవడం గణనీయంగా తగ్గించాయి. కేవలం 28 రోజుల్లోనే అవి తమ శరీర బరువులో 9 శాతం వరకు కోల్పోయాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 'వెగోవీ' (Wegovy) వంటి బరువు తగ్గించే మందులు చూపించే ఫలితాల కంటే ఇది మెరుగ్గా ఉందని డాక్టర్ జొనాథన్ లాంగ్ వెల్లడించారు.
దుష్ప్రభావాలు లేని చికిత్స!
ప్రస్తుతం వాడుకలో ఉన్న GLP-1 (వెగోవీ, ఓజెంపిక్) వంటి మందులు కడుపు ఖాళీ అయ్యే ప్రక్రియను మందగించడం ద్వారా పనిచేస్తాయి. దీనివల్ల వాంతులు, వికారం, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ, ఈ pTOS అణువు నేరుగా మెదడులోని హైపోథాలమస్ (ఆకలిని నియంత్రించే కేంద్రం) పై పనిచేస్తుంది. దీనివల్ల ఎటువంటి శారీరక అసౌకర్యం కలగకుండానే ఆకలి నియంత్రణలో ఉంటుందని ప్రొఫెసర్ లెస్లీ లీన్వాండ్ వివరించారు.
పాము నుంచి మనిషికి.. ముందడుగు!
"మనం పాములం కాకపోయినా, వాటి జీవక్రియ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ pTOS అణువు ఇప్పటికే మానవ మూత్రంలో స్వల్ప మొత్తంలో ఉంటుంది, కాబట్టి ఇది మనుషులకు సురక్షితమైనదిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ అణువు ఆధారంగా రూపొందించే మందులు ఊబకాయం మరియు దాని సంబంధిత వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. అడవిలోని క్రూరమైన పాముల నుండి ఆధునిక వైద్యశాస్త్రానికి ఒక గొప్ప కానుక దొరికిందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications