ఇస్రో సీన్ రివర్స్- 48 జీబీపీఎస్ స్పీడ్: నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్
ISRO: మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన హెవీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ జీశాట్ 20.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం- దేశ కమ్యూనికేషన్ల రంగంలో సరికొత్త విప్లవానికి తెర తీసినట్టయింది.
జీశాట్- 20 ఉపగ్రహాన్ని తాను సొంతంగా ప్రయోగించలేదు ఇస్రో. దీనికోసం ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ సహకారాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థ ఇది. స్పేస్ ఎక్స్‌కు చెందిన సూపర్ హెవీ వెయిట్ రాకెట్.. ఫాల్కన్ 9 ఈ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత 12:01 నిమిషాలకు అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి నింగిలోకి దూసుకెళ్లిందీ రాకెట్. 48 జీబీపీఎస్, కేఏ- బ్యాండ్ హెచ్‌టీఎస్ కమ్యూనికేషన్స్‌ను పేలోడ్‌గా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కమ్యూనికేషన్ల రంగంలో స్పేస్‌ఎక్స్‌తో భారత్ కొలాబరేట్ కావడం ఇదే తొలిసారి.
32 యూజర్ బీమ్‌లతో కూడిన జీశాట్ 20 ఉపగ్రహం ఇది. జీశాట్- ఎన్2గా పిలుస్తారు. ఈ యూజర్ బీమ్స్ అన్నీ భారత్‌లో ఉండే గ్రౌండ్, హబ్ స్టేషన్స్‌తో కనెక్ట్ అయ్యాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ సహా దేశంలోని అన్ని బ్రాడ్‌బ్యాండ్, ఇన్‌ఫ్లైట్, మారిటైమ్ టెలికాం కనెక్టివిటీ అవసరాలను తీర్చగలదీ ప్రాజెక్ట్.
Liftoff of GSAT-N2! pic.twitter.com/4JqOrQINzE
— SpaceX (@SpaceX) November 18, 2024
ఇదివరకు సొంతంగా అనేన అంతరిక్ష ప్రాజెక్టును విజయవంతం చేసిన ట్రాక్ రికార్డ్ ఉంది ఇస్రోకు. ఇతర దేశాలు రూపొందించిన శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత ఉంది. దీనికి భిన్నంగా జీశాట్-20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడానికి స్పేస్‌ఎక్స్ సహకారాన్ని తీసుకోవడం చర్చనీయాంశమౌతోంది.
Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S
— SpaceX (@SpaceX) November 18, 2024
ఆ సంస్థకు చెందిన స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలను వినియోగించుకోవడంలో భాగంగా ఈ ముందడుగు వేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే స్టార్‌లింక్‌తో సైతం సంప్రదింపులు పూర్తయినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న టెలికం నిబంధనలకు అనుసరించడానికి ఆ సంస్థ అంగీకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications