సామ్‌సంగ్ ఫోన్ ప్రియులకు స్వీట్ న్యూస్.. రూ.11,499లకే 5జీ ఫోన్..!
ప్రముఖ సామ్‌సంగ్ సంస్థ మరో కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే సామ్‌సంగ్ కూడా గతేడాది మార్చిలో విడుదల చేసిన ఫోన్ కు ఇప్పుడు అప్ డేటెడ్ మోడల్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్ మీకోసం ప్రత్యేకంగా..
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్16 5G ఫీచర్స్..
స్టోరేజ్..
ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 4GB, 6GB, 8GB RAM వేరియంట్స్ లో లాంఛ్ చేశారు. మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ప్రాసెసర్..
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలానే ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 OSతో పని చేస్తుంది.

కెమెరా..
ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ థర్డ్ (మాక్రో) కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
డిస్‌ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1,080 x 2,340 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
బ్యాటరీ..
5,000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
ధర..
ఈ ఫోన్ ధర అన్ని ఆఫర్‌లతో కలిపి రూ.11,499 నుండి ప్రారంభమవుతుంది. మొదటి సేల్‌ను మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. 4GB RAM 128GB ధర రూ 13,499. 6GB RAM 128GB స్టోరేజ్ ధర రూ 14,999. 8GB RAM 128GB స్టోరేజ్ ధర రూ 16,499. ఈ మొబైల్‌ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
కలర్స్..
ఈ మొబైల్ బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్, వైబింగ్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది.
కనెక్టివిటీ..
5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
సామ్‌సంగ్ ఫోన్ లను ఎక్కువగా ఇష్టపడే వారు తక్కువ ధరకే 5జీ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications