విశ్వం దాటి వస్తున్న ఏలియన్స్ సిగ్నల్స్? కోట్ల ఏళ్ల నాటి వింత శబ్దాల రహస్యం!

ఈ అనంత విశ్వం ఎన్నో రహస్యాలకు నిలయం. భూమిపై ఉన్న శాస్త్రవేత్తలు అంతరిక్షాన్ని శోధిస్తున్న కొద్దీ కొత్త వింతలు బయటపడుతూనే ఉన్నాయి. నిశబ్దంగా ఉండే నింగి నుంచి హఠాత్తుగా కొన్ని విచిత్రమైన శబ్దాలు, సిగ్నల్స్ మన రేడియో టెలిస్కోపులకు చిక్కుతుంటాయి. కొన్ని మిల్లీ సెకన్ల పాటు వచ్చే ఈ కాంతి మెరుపులు, రేడియో తరంగాలు సూర్యుడు కొన్ని రోజుల పాటు విడుదల చేసే శక్తి కంటే చాలా రెట్లు శక్తివంతమైనవి అంటే నమ్మగలమా? కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి భూమిని తాకుతున్న ఈ రేడియో సిగ్నల్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ఇప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాలుగానే మిగిలింది.

ఒక్కసారి వచ్చి మాయమైన ఆ 'వావ్' సిగ్నల్!

అంతరిక్ష సంకేతాల చరిత్రలో 1977లో జరిగిన ఒక సంఘటన చాలా ప్రాచుర్యం పొందింది. అమెరికాలోని ఒహియో రేడియో టెలిస్కోప్ ఒక విచిత్రమైన సంకేతాన్ని పసిగట్టింది. దాన్ని పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త జెర్రీ ఎహ్మాన్ తీవ్ర ఆశ్చర్యానికి లోనై, ఆ డేటా ప్రింటవుట్‌పై పెన్నుతో 'వావ్!' (Wow!) అని రాశారు. కేవలం 72 సెకన్ల పాటు మాత్రమే వినిపించిన ఆ శబ్దం ఆ తర్వాత శాశ్వతంగా మూగబోయింది.

Unexplained Cosmic Signals How The Famous Little Green Men Pulses Puzzled Top Astronomers For Decades

విశ్వంలో అత్యంత ఎక్కువగా ఉండే హైడ్రోజన్ వాయువు విడుదల చేసే ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఈ సిగ్నల్ ఉండటంతో, ఏలియన్స్ ఏమైనా మనతో మాట్లాడటానికి ప్రయత్నించాయా? అనే చర్చ నడిచింది. శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ఆకాశంలో అదే ప్రాంతాన్ని ఎంత జల్లెడ పట్టినా ఆ శబ్దం మళ్లీ రాలేదు. అది గ్రహశకలాల వల్ల వచ్చిందా లేదా మరేదైనా సహజ వనరుల వల్ల పుట్టిందా అనేది ఇప్పటికీ తేలని మిస్టరీ.

సూర్యుడిని మించిపోయే కాంతి వేగం.. 'ఫాస్ట్ రేడియో బరస్ట్స్'

ఇక అంతరిక్షంలో సెకనులో వందో వంతు కాలం మాత్రమే మెరిసి మాయమయ్యే సంకేతాలను 'ఫాస్ట్ రేడియో బరస్ట్స్' (FRBs) అంటారు. ఈ అతి తక్కువ సమయంలోనే అవి సూర్యుడు కొన్ని రోజుల పాటు ఉత్పత్తి చేసేంత ఎనర్జీని విడుదల చేస్తాయి. 2007లో శాస్త్రవేత్తలు పాత టెలిస్కోప్ డేటాను పరిశీలిస్తున్నప్పుడు ఇలాంటి మొదటి సిగ్నల్ బయటపడింది. అది మన పాలపుంత అవతలి నుంచి వచ్చినట్లు గుర్తించారు.

400 కోట్ల ఏళ్ల నాటి మిస్టరీ వీడింది! అంతరిక్షంలో చక్కెర వర్షం..
400 కోట్ల ఏళ్ల నాటి మిస్టరీ వీడింది! అంతరిక్షంలో చక్కెర వర్షం..

సాధారణంగా ఇలాంటి ప్రచండమైన శబ్దాలు అంతరిక్షంలో ఏదైనా నక్షత్రం పేలిపోయినప్పుడు లేదా రెండు శక్తులు ఢీకొన్నప్పుడు ఒకేసారి వస్తాయని భావిస్తారు. కానీ 'FRB 121102' అనే సిగ్నల్ మాత్రం ఇందుకు భిన్నంగా పదే పదే రిపీట్ అవుతూ శాస్త్రవేత్తలను ముప్పితిప్పలు పెడుతోంది. ఒకసారి వచ్చి పోతే ప్రమాదం అనుకోవచ్చు, కానీ మళ్లీ మళ్లీ వస్తోందంటే అక్కడ ఏదో ఒక శక్తివంతమైన వస్తువు సజీవంగానే ఉండి ఈ పని చేస్తోందని అర్థం. అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు కలిగిన చనిపోయిన నక్షత్రాల అవశేషాల (మాగ్నెటార్స్) వల్ల ఇవి పుడుతుండవచ్చని ఒక అంచనా.

ప్రతి 18 నిమిషాలకు వెలిగే అంతరిక్ష లైట్‌హౌస్!

సాధారణంగా అంతరిక్షంలోని నక్షత్రాలు లేదా పల్సర్లు సెకనుకు కొన్ని వందల సార్లు తిరుగుతూ సిగ్నల్స్ ఇస్తుంటాయి. కానీ 2022లో ఆస్ట్రేలియా రేడియో టెలిస్కోప్ డేటాలో ఒక వింత వస్తువు దొరికింది. అది ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ, మళ్లీ మాయమవుతోంది. అంటే గంటకు సరిగ్గా మూడు సార్లు మాత్రమే వెలిగే లైట్‌హౌస్ అన్నమాట. అంతరిక్ష నియమాలకు భిన్నంగా ఇంత నిదానంగా తిరిగే ఆ వస్తువు ఏంటనేది ప్రస్తుత ఖగోళ సిద్ధాంతాలకు కూడా అందడం లేదు.

ఆ ఏలియన్స్ కాస్తా 'పల్సర్లు' అయ్యాయి!

1967లో జోస్లిన్ బెల్ అనే శాస్త్రవేత్తకు అత్యంత ఖచ్చితమైన సమయ వ్యవధితో ఒక రేడియో సిగ్నల్ దొరికింది. అది ఎంత పక్కాగా ఉందంటే.. ఖచ్చితంగా వేరే గ్రహం మీదున్న వింత మనుషులే మనకు సందేశాలు పంపుతున్నారని భావించి, ఆ సిగ్నల్‌కు సరదాగా 'లిటిల్ గ్రీన్ మెన్' (LGM-1) అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత లోతుగా పరిశోధించగా, అది ఏలియన్స్ పంపిన సంకేతం కాదని, అంతరిక్షంలో వేగంగా తిరిగే 'పల్సార్' అనే ఒక రకమైన నక్షత్రం అని తేలింది.

అంతరిక్ష కేంద్రంలో భారతీయుడికి గ్రాండ్ వెల్‌కమ్! మహోన్నత ఘట్టం..
అంతరిక్ష కేంద్రంలో భారతీయుడికి గ్రాండ్ వెల్‌కమ్! మహోన్నత ఘట్టం..

ఈ అంతుచిక్కని సిగ్నల్స్ భూమికి చేరుకునే లోపు అంతరిక్షంలోని శూన్యంలో ఉన్న గ్యాస్, ధూళి కణాల గుండా ప్రయాణిస్తాయి. అలా రావడం వల్ల ఆ సిగ్నల్స్‌లో జరిగే చిన్న మార్పులను బట్టి, మన కంటికి కనిపించని అంతరిక్ష రహస్యాలను, అక్కడ ఉన్న పదార్థాలను కొలవడానికి శాస్త్రవేత్తలకు ఇవి ఒక వేలిముద్రల్లా ఉపయోగపడుతున్నాయి. ఇవి ఏలియన్స్ పంపే సంకేతాలా? కాదా? అన్నది పక్కన పెడితే.. విశ్వం మనకు అందిస్తున్న సరికొత్త సహజ వింతలను అర్థం చేసుకోవడానికి ఈ శబ్దాల రీసెర్చ్ నిరంతరం సాగుతూనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+