Viral News: ప్రపంచాన్ని మార్చేస్తున్న డ్రైవర్‌లెస్ కార్స్.. పొదల్లో పనులు కార్లోనే..!!

Driverless Cars: ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ సైతం రోజురోజుకూ కొత్త పుంతలో తొక్కుతోంది. ఇప్పటికే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డ్రైవర్ లెస్ కార్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇప్పటికే ఈ డ్రైవర్ లెస్ కార్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇది ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం దీనిని మరోలా వాడేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. అమెరికన్ సర్రీ యూనివర్సిటీ నిపుణులు ఓ సర్వే నిర్వహించింది. చాలా మంది వీటికి రవాణా కోసం వినియోగిస్తారని మనం సాధారణంగా భావిస్తుంటాం. అయితే సర్వేలో మాత్రం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 60 శాతం మంది ఈ డ్రైవర్ లెస్ కార్లలో ఎక్కువగా సెక్స్ చేసేందుకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. గతంలో కార్లలో రొమాన్స్ చేయాలంటే సహజంగా మనుషులు ఎక్కువగా తిరగని ప్రాంతాలు లేదా చెట్ల వద్ద కార్లను పార్క్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు నడుస్తున్న కార్లలో డ్రైవర్ కూడా లేకపోవటంతో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా రెచ్చిపోతున్నారని తేలింది.

Usage of driverless cars busted shocking facts survey reports shocking

సరదాగా గడిపేందుకు అష్టకష్టాలు పడి స్థలం వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సమస్యకు డ్రైవర్ లెస్ కార్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయని సర్వే వెల్లడించింది. ఒకపక్క కారు తనంతట తాను నడుస్తూనే ఉంటుండగా.. మరో పక్క ప్రేమ పక్షులు తమ పనులు తాను చేసుకుపోతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై పరిశోధనలు ప్రస్తుతం ఎక్కువగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రోట్లపై డ్రైవర్లు లేని కార్లను నడపటం ఎంతవరకు సురక్షితం అనే విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించని భారత్ వంటి దేశాల్లో వీటి అమలుకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

లోపల మాత్రమే కాదు. డ్రైవర్‌లేని కారు వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ టూరిజం దిశ మారిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. కార్లను కామాంధులు ఓయో రూమ్స్ కంటే గోరంగా వాడేస్తున్నారు. అధిక ఖర్చు చేసి హోటల్ గదులు తీసుకోవటానికి బదులుగా కార్లలో వ్యభిచారం కూడా పెరుగుతుంది. దీంతో హోటల్ రూమ్స్‌కి డిమాండ్ తగ్గినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో కార్లలో ఎక్కువ స్థలం ఉండే విధంగా వివిధ మార్పులు సైతం జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2040 నాటికి ఈ కార్లతో పెద్ద మార్పులు రోడ్లపైనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+