రీఛార్జ్ ప్లాన్‌లు భారీగా తగ్గించిన వోడాఫోన్ ఐడియా.. రూ.300 లోపు ఆఫర్లు ఇవే
వోడాఫోన్ ఐడియాకు (Vodafone idea) ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 20 కోట్ల మంది వినియోదగదారుల ప్రయోజనాలను కూడా కేంద్రం కాపాడింది. దీంతో వోడాఫోన్ ఐడియా రిఛార్జ్ ప్లాన్స్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల పరంగా దేశంలో మూడో స్థానంలో ఉంది. ఈ సంస్థకు ప్రస్తుతం 155 మిలియన్ యాక్టివ్ యూజర్లున్నారు. ఇటీవల కేంద్రం నుంచి భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్ బకాయిలు రూ.87,695 కోట్లు ఫ్రీజ్ చేయడం సహా అయిదేళ్ల మారటోరియంకు ఆమోదం తెలిపింది. 2031-32 నుంచి 2040-41 వరకు ఈ చెల్లింపులను పూర్తి చేసేందుకు వీలు కలిగినట్లు తెలిపింది. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు పెంచుకునే పనిలో నిమగ్నమైంది. అందుకే Vi ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను వెల్లడించింది. ఈ జాబితాలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.
రూ.179 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ తో పాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. 24 రోజుల వ్యాలిడిటీతో మొత్తంగా 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

రూ.189 రీఛార్జ్ ప్లాన్ :
ఇందులో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. 300 SMS + 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులు.
రూ.199 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS + 2GB డేటాను వినియోగించుకోవచ్చు. 28 రోజులు వ్యాలిడిటీతో Vi యాప్ లో లైవ్ న్యూస్, టీవీ షోలు, సినిమాలను వీక్షించవచ్చు.
రూ.209 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ + 300 SMS + 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. 28 రోజులు ప్రీ కాలర్‌ట్యూన్స్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.
రూ.218 రీఛార్జ్ ప్లాన్ :
ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయంతో పాటు మొత్తంగా 3GB డేటా, 300 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుందని వోడాఫోన్ ఐడియా తెలిపింది.
రూ.239 రీఛార్జ్ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 300 SMS లను పొందవచ్చు. 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు నెల రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. Vi యాప్ లో టీవీ షో, సినిమాలు, లైవ్ న్యూస్‌ను వీక్షించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications