కాంతి ఒక రోజులో ప్రయాణించేంత దూరానికి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్: విశ్వపు అంచులకు చేరువ

అంతరిక్ష చరిత్రలోనే ఎవరూ ఊహించని ఓ అధ్యాయానికి తెర తీసింది.. వోయేజర్ 1. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్త నాసా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఇది. అంతరిక్షంలో దాదాపు అర్థ శతాబ్ద కాలంగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తోన్న ఈ వ్యోమనౌక.. ఒక లైట్ డే ను అందుకోబోతోంది. భూమి నుంచి కాంతి ఒక రోజు ప్రయాణించే దూరానికి వెళ్లనుంది. దాదాపుగా విశ్వం అంచులకు చేరుకోనుంది. ఈ నెల 18వ తేదీన కాంతి దూరాన్ని అధిగమిస్తుందని నాసా తెలిపింది.

మానవ నిర్మితమైన ఏ వస్తువు కూడా ఇప్పటివరకు మన గ్రహం నుంచి ఇంత సుదూర ప్రాంతానికి చేరుకోలేదు. నాసా రూపొందించిన వ్యోమనౌక.. వోయేజర్ 1. 1977 సెప్టెంబర్ 5వ తేదీన దీన్ని ప్రయోగించింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా నిరంతరాయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. విశ్వం అంచులను తాకుతోంది. మన పాలపుంతను దాటి వెళ్లడానికి చేరువ అయింది. విశ్వంలో ఇప్పటివరకు తెలియని అనేక వింతలు, విశేషాలు, రహస్యాలను నాసాకు పంపించింది. నెప్ట్యూన్ కదలికలు, దాని గమనం, చంద్రులను సైతం అతి సమీపం నుంచి చిత్రీకరించింది.

Voyager 1 spacecraft will reach a distance of one light-day from Earth with 60700 km speed in Space

ఒక లైట్ డే అంటే.. శూన్యంలో కాంతి ఒక్క రోజు వ్యవధిలో ప్రయాణించే మొత్తం దూరం. కాంతి వేగం సెకనుకు సుమారు మూడు లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన వోయేజర్ 1.. భూమి నుంచి దాదాపు 2,590 కోట్ల కిలోమీటర్ల దూరానికి వెళ్లిపోయింది. సాధారణంగా ఒక మనిషి నడిచే వేగంతో ఈ దూరాన్ని చేరుకోవాలంటే ఆరు లక్షల ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఈ వ్యోమనౌక మాత్రం 50 సంవత్సరాల్లో ఈ ఘనతను సాధించింది. 1980లో శని గ్రహ గురుత్వాకర్షణకు లోను కావడం వల్ల గంటకు సుమారు 60,700 కిలోమీటర్ల వేగంతో అది పరిభ్రమిస్తోంది.

భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్
భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్

ఈ చారిత్రాత్మక ప్రయాణంలో నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలకు అనేక సాంకేతిక సవాళ్ళు ఎదురయ్యాయి. వోయేజర్ 1లోని రేడియోఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్లు ప్లుటోనియం 238 ఆధారంగా పనిచేస్తాయి. వ్యోమనౌకను ప్రయోగించిన సమయంలో ఇవి 470 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, ఈ అయిదు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆ సామర్థ్యం 215 వాట్లకు పడిపోయింది. ప్రతిఏటా సగటున నాలుగు వాట్ల విద్యుత్ తగ్గుతూ వస్తోంది.

పవన్ కల్యాణ్ విడాకులపై మూడు రోజుల ముందే హింట్ ఇచ్చిన రేణు దేశాయ్
పవన్ కల్యాణ్ విడాకులపై మూడు రోజుల ముందే హింట్ ఇచ్చిన రేణు దేశాయ్

దీంతో విద్యుత్ ను పొదుపు చేయడానికి నాసా శాస్త్రవేత్తలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యోమనౌకలో ఉన్న 10 పరికరాల్లో ఇప్పటికే ఎనిమిదింటిని నిలిపివేశారు. ప్రస్తుతం ఇందులో రెండు ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే సమాచారాన్ని సేకరిస్తోన్నాయి. విశ్వాంతరాళంలో ఉండే తీవ్రమైన చలి నుంచి నౌక భాగాలు గడ్డ కట్టుకుపోకుండా కాపాడుకోవడానికి అత్యవసర వ్యవస్థలను మాత్రమే నడుపుతున్నారు.. శాస్త్రవేత్తలు.

పండగ సీజన్ ఎఫెక్ట్- బంగారం ధరల్లో మరో తగ్గుదల
పండగ సీజన్ ఎఫెక్ట్- బంగారం ధరల్లో మరో తగ్గుదల

ప్రస్తుతం భూమి నుంచి వోయేజర్ 1కు రేడియో సిగ్నల్ చేరడానికే దాదాపు ఒక రోజు పడుతోంది. అలాగే అక్కడి నుంచి తిరుగు డేటా రావడానికి మరొక రోజు సమయం పడుతుండటంతో కమ్యూనికేషన్ ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా మారింది. ఒక కాంతి దినం దూరాన్ని తాకడమే వోయేజర్ 1 సాధించే చివరి మైలురాయి కానుంది. తగ్గిపోతున్న విద్యుత్ కారణంగా 2030 నాటికి మిగిలిన పరికరాలు కూడా పూర్తిగా ఆగిపోతాయని నాసా భావిస్తోంది.

2036 నాటికి వోయేజర్ 1కు భూమితో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని నాసా అంచనావేసింది. భూమితో సంకేతాలు నిలిచిపోయినప్పటికీ శూన్య వాతావరణం కారణంగా వోయేజర్ 1 ఇదే వేగంతోనే ప్రయాణిస్తుందని చెబుతోంది. సౌర వ్యవస్థ సరిహద్దులో తోకచుక్కలు ఏర్పడే ఓర్ట్ క్లౌడ్ ప్రారంభ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఈ వ్యోమనౌకకు దాదాపు 300 ఏళ్ళు పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+