SRH vs RR: 105 మీటర్ల సిక్స్, ఓవర్‌లో 23 పరుగులు.. ఎగిరి గంతేసిన కావ్య పాప(వీడియో వైరల్)
SRH vs RR: ఐపీఎల్ 2025లో రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి భయపడిందే జరిగిందే. హైదరాబాద్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రాజస్థాన్ బౌలర్లను దెబ్బతీశారు. అయితే రాజస్థాన్ జట్టు నాలుగో ఓవర్లోనే అభిషేక్ ను ఔట్ చేసింది. కానీ ట్రావిస్ హెడ్ తన పనిని కొనసాగించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 5వ ఓవర్ వేయడానికి జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో హెడ్ తన ప్రతాపాన్ని చూపించాడు. ఆర్చర్ వేసిన ఈ ఓవర్లో హెడ్ మొత్తం 5 బౌండరీలు బాదాడు. ఆ ఓవర్ లోని మొదటి బంతికి హెడ్ బౌండరీ కొట్టాడు, రెండవ బంతిని డీప్ మిడ్-వికెట్ మీదుగా 105 మీటర్ల భారీ సిక్స్ ను బాదాడు. దీని తర్వాత హెడ్ ఈ ఓవర్‌లోని 4వ, 5వ, 6వ బంతుల్లో ఫోర్లు కొట్టాడు. ఈ విధంగా ఆర్చర్ వేసిన ఈ ఓవర్లో హెడ్ మొత్తం 23 పరుగులు చేశాడు.

ఎగిరి గంతేసిన కావ్య మారన్
ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చూసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తన ఆనందాన్ని ఆపుకోలేకపోయింది. కావ్య స్టాండ్స్ లో కూర్చుని హెడ్ తుఫాన్ ను చూస్తూ సంతోషంతో ఎగిరి గంతులేసింది. హెడ్ బ్యాటింగ్ చూసి కావ్య చప్పట్లు కొట్టింది. కావ్య మారన్ ఐపీఎల్ ప్రతి సీజన్ లో తన జట్టుకు మద్దతు ఇవ్వడానికి స్టేడియంలో కనిపించి వారిని ప్రోత్సహిస్తారు.
పవర్ ప్లేలో పరుగుల జోరు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలోనే రాజస్థాన్ ను చిత్తు చేసింది. హైదరాబాద్ జట్టు మొదటి 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇషాన్ తో పాటు నితీష్ కుమార్ రెడ్డి తన జోరును కొనసాగిస్తున్నాడు. 300 లోడింగ్ అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.
Hurricane Head graces #TATAIPL 2025 🤩
— IndianPremierLeague (@IPL) March 23, 2025
Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S
SRH OWNER IN THE GROUND 🌟 pic.twitter.com/12RFQTLutx
— Johns. (@CricCrazyJohns) March 23, 2025












Click it and Unblock the Notifications