RCB సంబరాలు..11కి చేరిన మృతుల సంఖ్య
ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన భారీ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్సీబీకి స్వాగతం పలికేందుకు, విజయోత్సవ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలు తలెత్తడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పగా, ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డవారిని పరామర్శించారు. ఈ ఘటన బెంగళూరు నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. అభిమానుల ఆనందం క్షణాల్లోనే తీరని విషాదంగా మారడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications