ఈ ఫొటోలో గడుగ్గాయిని గుర్తు పట్టారా?
Rohit Sharma: రోహిత్ శర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ ప్రపంచానికి మాత్రమే కాదు.. ఈ పేరు తెలియని వారు ఉండరు. అభిమానులు అతన్ని హిట్ మ్యాన్‌గా పిలుచుకుంటారు. క్రికెట్‌లో భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోన్న జట్టు సారథి. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తోన్న డాషింగ్ ఓపెనర్.
హిట్ మ్యాన్‌గా అభిమానులు పిలుచుకునే రోహిత్ శర్మ నేడు పుట్టినరోజును జరుపుకొంటోన్నారు. నేటితో 36 సంవత్సరాల నిండాయాయనకు. 1987 ఏప్రిల్ 30వ తేదీన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు రోహిత్ శర్మ. 1999లో తొలిసారిగా బ్యాట్ పట్టారు. 2006 నాటికి జాతీయ జట్టులో చోటు సాధించారు.

అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. అన్ని ఫార్మట్లల్లో కలిపి 18,820 పరుగులు చేశాడు. ఇందులో వన్డే- 10,709, టెస్ట్- 4,137, టీ20 ఇంటర్నేషనల్స్- 3,974 పరుగులు ఉన్నాయి. రోహిత్ శర్మ పేరు మీద 48 సెంచరీలు నమోదయ్యాయి. అత్యధికంగా 597 సిక్సర్లు బాదిన రికార్డు ఉంది.
ఐపీఎల్‌లో చేసిన 6,522 పరుగులు దీనికి అదనం. ఈ మూడు ఫార్మట్లల్లో ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య 20,000లను దాటి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సింగిల్ ఐసీసీ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అయిదు సెంచరీలు కొట్టిన ఘనత రోహిత్ శర్మదే. గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా ఆడాడు. 125.9 స్ట్రైక్ రేట్‌తో 597 పరుగులు చేశాడు. 54.3 బ్యాటింగ్ యావరేజ్‌ను అందుకున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌లో రోహిత్ ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి పూర్ణిమ.. ఓ క్యూట్ ఫొటోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. యంగ్ హిట్ మ్యాన్ ఫొటో అది. తన కుమారుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఈ ఫొటో షేర్ చేశారు.












Click it and Unblock the Notifications