ఆ కటౌట్ చూడ్రా బై- బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయ్

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్ పలు రికార్డులను తిరగరాసింది. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తాను ఎంత గొప్ప బ్యాటరో నిరూపించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 350 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ సిక్సర్స్ ఇవి.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ-135 (నాటౌట్), ట్రావిస్ హెడ్-37, ఇషాన్ కిషన్- 25, హెన్రీచ్ క్లాసెన్- 37 (నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. ఇషాన్ రనౌట్ అయ్యాడు.

ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసింది. నితీష్ రాణా- 57 తో రాణించాడు. కేఎల్ రాహుల్- 37, సమీర్ రిజ్వీ- 41 పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగా నాలుగు వికెట్లతో బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. హర్ష్‌ దూబే మూడు వికెట్లతో సత్తా చాటాడు. దిల్షాన్ మదుషంక, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.

ఈ శతకంతో అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో తొమ్మిది సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. భారత బ్యాటర్లల్లో అత్యధిక టీ20 శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు వీరిద్దరూ ఉన్నారు. అభిషేక్ 184 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. రోహిత్ శర్మ ఎనిమిది సెంచరీలు చేయడానికి 454 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, అభిషేక్ అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.

Abhishek Sharma Smashes unbeaten 135 off 68 balls as SRH Eclipse DC with 242 Total Stunning shattered

అభిషేక్ శర్మ రికార్డుస్థాయి స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడీ మ్యాచ్ తో. అతని సగటు స్ట్రైక్ రేట్ 174.62. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే, ఇషాన్ కిషన్- 143, విరాట్ కోహ్లీ- 135, సంజు శాంసన్- 139, కేఎల్ రాహుల్- 137 స్ట్రైక్ రేట్ కంటే అభిషేక్ చాలా దూకుడైన ఆటగాడని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా అభిషేక్ శర్మ ఈ సీజన్ లో 300 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా అవతరించాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండో శతకం. తొలి సెంచరీ గత సీజన్ లో అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్లు చేసిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ ఇప్పుడు చేరాడు. అతని కంటే ముందు క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెక్‌కలమ్ (158*) మాత్రమే ఉన్నారు. తన మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా అభిషేక్ శర్మ పేరు మీదే ఉంది. గత సీజన్ లో 141 పరుగులు చేశాడు. క్వింటన్ డికాక్ (140*) తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇన్నింగ్ ఇదే అతనికి.

టీ20 క్రికెట్‌లో 130+ స్కోర్లను అత్యధిక సార్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలోనూ అభిషేక్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను నాలుగు సార్లు ఈ ఘనతను సాధించాడు. ఆరోన్ ఫించ్, క్రిస్ గేల్ మూడేసి సార్లు 130కి పైగా పరుగులు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+