టీమిండియా చిచ్చరపిడుగులు.. సునామీ సృష్టించారు

వెల్లింగ్టన్‌ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. మైదానంలో పరుగుల సునామీ సృష్టించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఊదిపడేసింది. రన్ ఛేజింగ్ లో ఓ నూతన రికార్డును నెలకొల్పింది. ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ పర్యటనలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. అయిదు మ్యాచ్ ఈ సిరీస్ ను 3-0తో గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించి మెరుపు శతకాన్ని అందుకున్నాడు. 297.37 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ సాగిందంటే ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. గ్రౌండ్ నలుమూలలా పరుగుల వర్షాన్ని కురిపించాడు. చివరికి కైల్ జేమీసన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Abhishek Sharma Vaibhav Sooryavanshi blistering as India commanding win over New Zealand 3rd t20i

టీ20 ఇంటర్నేషనల్స్ లో అభిషేక్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. అతనికంటే ముందు రోహిత్ శర్మ అయిదు సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పై 30, ఇంగ్లాండ్ పై 37 బంతుల్లో సెంచరీ బాదాడు అభిషేక్. అతనితో పాటు మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా పవర్‌ప్లేలో చెలరేగి ఆడాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు వైభవ్. ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేశారు వీరిద్దరూ. మ్యాథ్యూ ఫిషర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ అవుటైనప్పటికీ.. తొలి వికెట్ భాగస్వామ్యం న్యూజిలాండ్ బౌలింగ్ విభాగాన్ని కుదేల్ చేసింది. వీరి ధాటికి పవర్‌ప్లేలోనే భారత రన్ రేట్ 14 దాటి దూసుకెళ్లింది.

టీ20లో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్- భారీ టార్గెట్: న్యూజిలాండ్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్
టీ20లో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్- భారీ టార్గెట్: న్యూజిలాండ్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్

బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. జాకబ్ డఫీ 2 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆడమ్ మిల్నే 2 ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నాడు. మైకేల్ బ్రేస్‌వెల్ 2 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3.2 ఓవర్లలో 45 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించగా, మ్యాథ్యూ ఫిషర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తో కొంత ప్రభావం చూపించగలిగాడు.

వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు
వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు

తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు విజృంభించారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేశారు. భారత్ ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచారు. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ కు వెన్నుముకగా నిలిచాడు. బెవాన్ జాకబ్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+