మొహసిన్ నఖ్వీ.. త్వరలో ఇంటికి: BCCI దెబ్బకు.. !!

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ పదవీకాలం ముగిసే సమయం దగ్గరపడుతోంది. ఇక ఆయన ఎంతో కాలం పాటు ఈ పదవిలో కొనసాగబోరు. ఆయనకు పదవీకాల పొడిగింపు లభించే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. భారత్‌తో ఉన్న తీవ్ర విభేదాలు, ఇతర ఏసీసీ సభ్య దేశాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తోన్నారు.

బీసీసీఐతో నఖ్వీకి ఉన్న సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భారత మహిళ, పురుషుల క్రికెట్ జట్లు ఆయన చేతుల మీదుగా ఎలాంటి ట్రోఫీని అందుకోవడానికి ఇష్టపడట్లేదు. గత ఏడాది ఆసియా కప్ గెలిచిన టీమిండియా గానీ, ఆదివారం శ్రీలంకపై జరిగిన ఫైనల్ లో గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన గానీ ట్రోఫీని అందుకోని విషయం తెలిసిందే. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఈ కప్ ను విజేతకు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఆ హోదాలో మొహసిన్ నఖ్వీ ఉండటం వల్ల ఆయన చేతుల మీదుగా వీటిని తీసుకోవట్లేదు.

ACC Chairman Mohsin Naqvi Set to Lose His Job in Next Year Extension Unlikely Tenure Nearing End

ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవి రొటేషన్ పద్ధతిలో కొనసాగుతుంటుంది. అయిదు ప్రధాన సభ్యదేశాలు.. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ ఛైర్మన్ పదవి మారుతూ ఉంటుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో దీనిని నిర్ణయిస్తారు. అధ్యక్షుడి పదవీకాలాన్ని పొడిగించాలంటే మాత్రం ఏసీసీ సభ్యదేశాల ఏకగ్రీవ మద్దతు అవసరమౌతుంది.

ఆ ఉగ్రవాదిపై 70 లక్షల రివార్డ్ ప్రకటించిన పాకిస్తాన్: కేంద్రం ఘాటుగా రియాక్ట్
ఆ ఉగ్రవాదిపై 70 లక్షల రివార్డ్ ప్రకటించిన పాకిస్తాన్: కేంద్రం ఘాటుగా రియాక్ట్

ఒకవేళ చైర్మన్ పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించాలన్నా, మరో సభ్య దేశం ఏజీఎంలో ఆ ప్రతిపాదనను అధికారికంగా తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుత ఉద్రిక్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా మొహసిన్ నఖ్వీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితులు దాదాపుగా లేవు. ఫలితంగా ఆయన ఈ రెండేళ్ల పదవీకాలానికే పరిమితం కావలసి వస్తోంది. ఇది.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ముగియబోతోంది.

మొహసిన్ నఖ్వీకి బిగ్ షాక్: విమెన్స్ టీమిండియా తగ్గేదే లేదు: ఆసియా కప్ అందుకోవడానికి నిరాకరణ
మొహసిన్ నఖ్వీకి బిగ్ షాక్: విమెన్స్ టీమిండియా తగ్గేదే లేదు: ఆసియా కప్ అందుకోవడానికి నిరాకరణ

నఖ్వీ కంటే ముందు శ్రీలంకకు చెందిన షమ్మీ సిల్వా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025 ఏప్రిల్ లో నఖ్వీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. క్రీడల్లో రాజకీయాలు, వ్యక్తిగత వివాదాలకు తావులేకుండా ఉండాలనే బీసీసీఐ కఠిన వైఖరి నఖ్వీ పదవిపై గట్టి ప్రభావం చూపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఆయన తన పదవిని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+