Wold Cup 2023: టీమిండియా కప్ గెలిస్తే - హీరోయిన్ "బోల్డ్ ఆఫర్"..!!
ప్రపంచ కప్ ఫీవర్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. టీమిండియా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. న్యూజీలాండ్ పైన రోహిత్ సేన సాధించిన విజయం చిరస్మరణీయంగా మారుతోంది. క్రికెట్ లెజెండ్స్ టీమిండియా ఆట తీరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక, టీమిండియా ఈ నెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్స్ ఆడనుంది. ఇక..టీమిండియా గెలిస్తే భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ సంచలన ప్రకటన చేసింది.
టీమిండియా గెలిస్తే:టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా వరల్డ్ కప్-2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం జరిగే ఫైనల్ బిగ్‌ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈసారి ప్రపంచ కప్ భారత్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖాభోజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. 'ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా' అంటూ పోస్ట్ పెట్టింది. ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది బట్టలిప్పి పరుగులు తీస్తుంటారు. అలా ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడమే స్ట్రీకింగ్ అంటారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అలాంటి పని చేయనుంది.

అంతకంటే ఆనందం:ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందని ఆమె తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తే...వైజాక్ బీచ్‌లో తన దుస్తులు తొలగించి పరుగెడుతానని ఆమె బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. వాటికి రేఖా భోజ్ కూడా ఇలా రిప్లై ఇచ్చింది. తాను మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్‌పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు.' అని రేఖా బోజ్ తెలిపింది. కానీ కొందరు మాత్రం అంతే బోల్డ్‌గా వైజాగ్ వచ్చేస్తామంటూ భిన్నంగా చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
If India wins the World Cup,
— Rekha Boj (@rekha_boj) November 15, 2023
I will streak on Visakhapatnam beach.
India World Cup కొడితే, వైజాగ్ బీచ్ లో streaking చేస్తా...
కామెంట్స్ వైరల్:బోల్డ్ సినిమా అయిన మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో ఈ వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ నటించింది . కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వైజాగ్‌లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైన కూడా ఆమె గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విశాఖపట్నంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం. ఇప్పుడు ఈ కామెంట్స్ తో చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications