రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు త్రిబుల్ జాక్ పాట్.. !!

ఐపీఎల్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు డబుల్ జాక్ పాట్ తగిలింది. ఇప్పటికే వరుసగా రెండు సీజన్ లల్లో ఛాంపియన్ గా నిలిచిన ఈ జట్టుకు ఇక కొత్త యాజమాన్యం రాబోతోంది. యాజమాన్య మార్పిడికి సంబంధించిన ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ జట్టును కొనుగోలు చేయడానికి కుదిరిన దాదాపు 16,660 కోట్ల రూపాయల ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఆమోదముద్ర వేసింది.

దేశీయ క్రీడా చరిత్రలోనే అత్యంత భారీ డీల్ ఇది. ఏకంగా 16,660 కోట్ల రూపాయలతో ఓ ఫ్రాంఛైజీ చేతులు మారడం అనేది ఇదే మొదటిసారి. ఈ డీల్ పూర్తి కావడంతో ఆర్‌సీబీలో నూతన శకం ఆరంభమైనట్టయింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి కొత్త యాజమాన్యం రాబోతోంది. దేశీయ, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో కూడిన ఒక శక్తిమంతమైన కన్సార్టియం చేతికి యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి.

Aditya Birla-Led Consortium Wins Regulatory Nod to Buy RCB for Rs 16 660 Crore CCI Clears Deal

ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్, అతిపెద్ద మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. ఆర్‌సీబీ ప్రస్తుత మాతృ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి నెలలోనే ఈ విక్రయాన్ని ప్రకటించింది. రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాల బదిలీకి సంబంధించిన ఈ భారీ ప్రతిపాదనను సీసీఐ నిశితంగా పరిశీలించి ఆమోదించింది.

ఈ ఒప్పందంలో భాగంగా బిగ్ బనియన్ హోల్డింగ్స్, బోల్ట్ ఐపీఎల్ హోల్డింగ్స్, టైమ్స్ ఇంటర్నెట్, టైమ్స్ క్రికెట్, ఐసీక్యూ ఆపార్చునిటీస్, ఆసియా ఇన్వెస్ట్‌మెంట్ టాప్కో 2 వంటి వివిధ అనుబంధ విభాగాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ డీల్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలూ లేకపోవడంతో దీనికి లైన్ క్లియర్ అయింది. పరిమితికి మించిన విలువ గల భారీ విలీనాలు, కొనుగోళ్లు జరిగినప్పుడు కేంద్ర రెగ్యులేటర్ సీసీఐ ఆమోదం అవసరం.

ఆర్‌సీబీ బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత బలంగా ఉన్నందున రెగ్యులేటర్.. ఈ ఒప్పందంలోని వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలను జాగ్రత్తగా పరిశిలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రిటీష్ లిక్కర్ దిగ్గజం డియాజియో గ్రూప్‌కు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, తన ప్రధాన వ్యాపారమైన మద్యం విక్రయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆర్సీబీని విక్రయించాలని నిర్ణయించింది. 2008 నుంచీ ఆర్‌సీబీ జట్టుకు యూఎస్‌ఎల్ యజమానిగా వ్యవహరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+