ఆస్ట్రేలియా ఇంటికి.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు: ఫైనల్స్‌లో ఏదో అద్భుతం జరిగేలా ఉందే..
Afghanistan vs Bangladesh: టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ చెలరేగిపోయింది. తన కంటే బలమైన జట్లను మట్టికరిపిస్తోంది. మొన్నటికి మొన్న ఐసీసీ వరల్డ్ కప్ ఛాంపియన్‌ను ఓడించగా ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.. దర్జాగా. దీని దెబ్బకు ఆస్ట్రేలియాకు సెమీస్ దారులు మూసుకుపోయాయి.
సెయింట్ విన్సెంట్‌లోని కింగ్స్‌టౌన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ అదరగొట్టింది. ప్రత్యేకించి- బౌలింగ్‌లో సత్తా చాటింది. బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. 115 పరుగులను కాపాడుకోగలిగారు. ఈ మాత్రం స్కోర్ చేయడానికి కూడా బంగ్లాదేశ్ గిలగిలలాడిందంటే ఆఫ్ఘన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. 43 పరుగులతో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఒక్కడే రాణించాడు. ఇబ్రహీం జడ్రాన్- 18, అజ్ముతుల్లా ఒమర్జాయ్- 10, గుల్బదీన్ నబీ- 4, మహ్మద్ నబీ- 1 పరుగు చేశారు. చివర్లలో కేప్టెన్ రషీద్ ఖాన్ 10 బంతుల్లో మూడు ఫోర్లతో 19 పరుగులు చేశాడు.
ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ప్రారంభంలోనే తేలిపోయింది. ఆఫ్ఘన్ బౌలర్లను ఏ దశలో కూడా ప్రతిఘటించలేకపోయింది. 20 ఓవర్లల్లో 105 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 49 బంతుల్లో ఒక సిక్స్, అయిదు ఫోర్లతో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తన్జిద్ అహ్మద్- 0, నాజ్ముల్ హొస్సైన్ శాంటో- 5, షకీబల్ హసన్- 0, సౌమ్యా సర్కార్- 10, తౌహీద్ హృదొయ్- 14, మహ్మదుల్లా- 6, రషీద్ హొస్సైన్- 0, తన్జిమ్ హస్సన్ షకీబ్- 3, తస్కిన్ అహ్మద్- 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్- 0, తన్జిమ్ హస్సన్ షకీబ్- 3, తస్కిన్ అహ్మద్- 2, పరుగులు చేశారు.
కేప్టెన్ రషీద్ ఖాన్, నవీనుల్ హక్ నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. గులబ్బదీన్ నబీ, ఫజల్ హక్ ఫారూఖీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టయింది ఆఫ్ఘనిస్తాన్. టీమిండియా ఇప్పటికే సెమీ ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. ఇదే గ్రూప్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications